సైడ్‌ ఇవ్వండి

new fashion sarees - Sakshi

కొత్త స్టైల్‌

అమ్మాయిలు స్టైల్‌లో చింపేస్తున్నారు.ఎడాపెడా కొత్త డిజైన్లు లాంగించేస్తున్నారు.కుడి ఎడమ తేడా చూపిస్తున్నారు.ఒకప్పుడు పైటలేనండి కుడి పక్క, ఎడమ పక్క.ఇప్పుడు టాప్‌లు కూడా కుడి ఎడమలు అయ్యాయి. కొత్త స్టైల్‌ వచ్చేసింది కొంచెం సైడ్‌ ఇవ్వండి.

శారీ విత్‌ ఒన్‌సైడ్‌  టాప్‌
చీర కట్టడం లేదంటే లంగా ఓణీనిధరించడం.. ఏముంది కొత్తదనంఅంటారా! బ్లౌజ్‌ బదులు ఇలా ఒన్‌సైడ్‌ లాంగ్‌ కుర్తా లేదా టాప్‌ వేసుకోండి.  లుక్‌లో వచ్చే మార్పుకు మీరే ఆశ్చర్యపోతారు. 

కుర్తీ  విత్‌  ఒన్‌సైడ్‌
ఏ సీజన్‌కైనా అతివలకు సౌకర్యంగా ఉండే డ్రెస్‌ కుర్తీ. అందుకే దీంట్లో చెప్పలేనన్ని స్టైల్స్‌ వచ్చాయి. అవి ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ ఉంటాయి. అలాగే, దీంట్లోనూ ఒన్‌సైడ్‌ సింగిల్‌ కలర్‌ డిజైనర్‌ కుర్తీలు వచ్చాయి. అదీ ఒకవైపు మాత్రమే పొడవుగా ఉండే డిజైన్‌ కుర్తీ లవర్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. రెండు రంగుల ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేసే ఈ కుర్తీలలోనూ చాలా వెరైటీలు ఉన్నాయి. 

లెహెంగావిత్‌  ఒన్‌ సైడ్‌  టాప్‌
బ్రైట్‌ కలర్‌లో డిజైన్‌ చేసిన లాంగ్‌ లెహెంగా మీదకు లాంగ్‌ స్లీవ్స్‌ బ్లౌజ్‌ లేదా క్రాప్‌టాప్‌ సరైన ఎంపిక. అయితే, అదే క్లాత్‌తో ఒక సైడ్‌లాంగ్‌ ప్యాటర్న్‌ని జత చేసి, దానికి కొంత ఎంబ్రాయిడరీని  కూర్చితే సంప్రదాయ, పాశ్చాత్య రెండు వేడుకులలో స్టైలిష్‌గా వెలిగిపోవచ్చు. 

లాంగ్‌ గౌన్‌ విత్‌ ఒన్‌ సైడ్‌ టాప్‌
ప్లెయిన్‌గా ఉండే వెస్ట్రన్‌వేర్‌కి మరిన్ని హంగులు  అద్దాలంటే సింపుల్‌ టెక్నిక్‌ ఉంది. అదే ఒన్‌సైడ్‌ లాంగ్‌జాకెట్‌. ఫ్లోరల్‌ డిజైన్‌తో ఉండే ఒన్‌సైడ్‌ లాంగ్‌ జాకెట్‌ లేదా టాప్‌ వెస్ట్రన్‌ గౌన్‌ రూపురేఖలే మార్చేస్తుంది. 

ట్రౌజర్‌  విత్‌ ఒన్‌ సైడ్‌  టాప్‌
ట్రౌజర్, క్రాప్‌టాప్‌నిబెనారస్‌ క్లాత్‌తో డిజైన్‌ చేయాలి.  టాప్‌ పార్ట్‌కి అదే రంగు జార్జెట్‌ మెటీరియల్‌తో ఒక వైపు మాత్రమే ఇలా కుచ్చులు పెట్టి జత చేస్తే స్టైలిష్‌ పార్టీవేర్‌డ్రెస్‌ రెడీ.

డిజైనర్‌ నెక్‌ పీస్‌
సంప్రదాయ దుస్తుల మీదకు బంగారు, ఇమిటేషన్‌ ఆభరణాలు అందంగా ఉంటాయి. కానీ, ఇండో వెస్ట్రన్‌ స్టైల్‌ దుస్తుల మీదకు అట్రాక్టివ్‌ లుక్‌నిచ్చే ఫ్యాన్సీ ఆభరణాలే ఉండాలి. దాన్ని చాలా సులువుగా మనకు మనంగానే రూపొందించుకోవచ్చు.
కావల్సినవి: ∙గులాబీ రంగు నూలు దారం – మీటరు ∙బంతిపువ్వు రంగు నూలు లేస్‌ విత్‌ ఉండలు ఉన్నది – మీటరు ∙చైన్‌ – 1 ∙క్లాంప్స్‌ – కొన్ని ∙పట్టు కార

1 క్లాంప్స్‌ని పట్టుకారతో తెరిచి బంతిపువ్వు రంగు నూలు లేసుకు జత చేయాలి. 

2 క్లాంప్స్‌ లేసును పట్టి ఉంచుతాయి. అలాగే చైన్‌ని కూడా జత చేస్తూ పట్టుకారతో క్లాంప్స్‌ని గట్టిగా నొక్కాలి. 

3 చిత్రంలో చూపిన విధంగా నూలు లేస్, క్లాంప్స్, చైన్‌ను మొత్తం జత చేయాలి.

4 క్లాంప్స్‌ మధ్య నుంచి గులాబీ రంగు దారాన్ని తీయాలి. 

5 సరిగా పట్టని చోట క్లాంప్‌ని మళ్ళీ తెరిచి, సరిచేయాలి. 

6 బంతిపువ్వు రంగు నూలు లేసు, క్లాంప్స్, చైన్, గులాబీరంగు నూలు దారం సెట్‌ చేసి, చివర్లు ముడివేయాలి.
చిత్రంలో చూపిన విధంగా ఫ్యాన్సీ నెక్‌ పీస్‌ రెడీ.

ఆభరణాలు లెస్‌ 
ఆభరణాలు అక్కర్లేని సింగారాన్ని ఈ స్టైల్‌తో రప్పించవచ్చు. దుస్తుల ద్వారా చూపించే కొత్తదనానికి ఎప్పుడూ ఓ ప్రత్యేకత ఉంటుంది. దానికి అదనపు హంగులుగా చేతికి గాజులు, మెడలో హారాలు అక్కర్లేదు. చెవులకు జూకాలు, సింపుల్‌ మేకప్‌తో పార్టీలో అదరగొట్టేయచ్చు. మీరూ ఇలా ట్రై చేయవచ్చు. 
నిర్వహణ
ఎన్‌.ఆర్‌. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top