రవికట్టు

New fashion to Saree with Blouse - Sakshi

చీర కట్టుకుని నడుముకు వడ్డాణం పెట్టుకోవడం పాత పద్ధతి. బ్లౌజ్‌నే బెల్ట్‌గా మార్చేసి చుట్టేయడం నేటి పద్ధతి.  రవికను ముడి వేసినట్టుగా... బెల్ట్‌తో పవిటను కట్టేస్తే... ఆ బెల్ట్‌కి ఎంబ్రాయిడరీ సొబగులు అద్దితే... అది ఇలా అందమైన బెల్ట్‌ బ్లౌజ్‌గా రూపుదిద్దుకుంటుంది.

స్టైలిష్‌ లుక్‌
►పైట చెంగుకు 8–10 ఫ్రిల్స్‌ పెట్టి, భుజం మీదుగా జాకెట్‌కు పిన్‌తో జత చేసి, అదే జాకెట్‌ బెల్ట్‌ పెట్టేసుకుంటే సరి. ఎలా సెట్‌ చేసిన ఫ్రిల్స్‌ అలాగే ఉంటాయి. సౌకర్యంగా ఉంటుంది. లుక్స్‌లో వచ్చిన స్టైలిష్‌ మార్పుకు వేడుకలో ఎక్కడా ఉన్నా బ్రైట్‌గా వెలిగిపోతారు.

►జాకెట్టు మాత్రమే కాదు బెల్ట్‌కూ ఎంబ్రాయిడరీ చేసి, ఇలా పైట కొంగుమీదుగా తొడిగేస్తే సరి. అలంకరణ పూర్తయినట్టే.  ట్రెండ్‌లో ఉన్నారన్న కితాబులూ సొంతం అవుతాయి. 

►ప్లెయిన్‌ శారీకి బెల్ట్‌ బ్లౌజ్‌ ప్రత్యేక ఆకర్షణ

►కాంట్రాస్ట్‌ బ్లౌజ్‌ ప్యాటర్న్‌ ఎంపిక చేసుకోవాలి. దానితో పాటు బ్లౌజ్‌కి సన్నని బెల్ట్‌నీ అదే రంగు ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేయించుకోవాలి.

►చిన్న ప్రింట్లు లేదా ప్లెయిన్‌  శారీకి ఎంబ్రాయిడరీ బెల్ట్‌ బ్లౌజ్‌ అక్కర్లేదు. ఫ్లోరల్‌ ప్రింట్‌ బెల్ట్‌ బ్లౌజ్‌ తీసుకుంటే చాలు. ఫ్యాషన్‌ వేదికలైనా, సంప్రదాయ వేడుకైనా స్పెషల్‌గా కనిపిస్తారు

►లాంగ్‌ బ్లౌజ్‌కి బెల్ట్‌ హంగుగా అమరితే సాదా చీర అయినా సరికొత్త స్టైల్‌తో మెరిసిపోతుంది.
–కీర్తిక,  డిజైనర్, హైదరాబాద్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top