గ్రేట్‌ రైటర్‌ (విలియం స్టాన్లీ మెర్విన్‌)

Article On W S Merwin In Sakshi Literature

ప్రధానంగా కవి అయిన విలియం స్టాన్లీ మెర్విన్‌ (1927–2019) ఒకవైపు విస్తృతంగా రాస్తూనే, మరోవైపు ఇతర భాషల కవిత్వాన్ని అంతే సీరియస్‌గా అమెరికా పాఠకులకు పరిచయం చేశాడు. తన సుదీర్ఘ ప్రస్థానంలో 50కి పైగా పుస్తకాలు వెలువరించాడు. 

ఐదేళ్ల వయసులోనే వాళ్ల నాన్న కోసం తోచిన పాటలు కట్టేవాడు. ఒకరోజు వీధిలో ఎవరో చెట్టును కొట్టడం చూసి దాని చేతులు నరికేస్తున్నారన్నంతగా బాధపడి, ఆవేశంతో వాళ్ల మీదికి పోయాడు. తర్వాత రెడ్‌ ఇండియన్ల జీవితం, వాళ్ల ప్రకృతి ప్రేమ, ఆయన ఆసక్తికర అంశాలుగా మారాయి. సంపాదకుడిగా పనిచేశాడు. కాంక్రీటు నగరాల్లో బతకలేనని హవాయిలో స్థిరపడ్డాడు. వ్యవసాయం చేశాడు. చెట్లు పెంచాడు. బౌద్ధ తత్వం, పర్యావరణ ప్రియత్వం ఆయనను పట్టించే మాటలు. 

అనువాదాల్లోకి దిగటానికి కారణం చెప్తూ– రాయడం మొదలుపెట్టినప్పుడు భావం నీదే కానీ భాష నీదై ఉండదు. ఎప్పుడైతే అనువాదానికి కూర్చుంటామో ప్రతీ పదం మీద శ్రద్ధ పెట్టడానికి అవకాశం దొరుకుతుంది, సరైన మాటలు వాడటమంటే ఏమిటో తెలుస్తుంది, అన్నాడు. ఒక దశలో కవిత్వం ప్రధానంగా మౌఖిక సంప్రదాయంలోనిదన్న అభిప్రాయానికి వచ్చాడు. విరామ చిహ్నాలు పేజీల మీద పదాల్ని కొట్టే మేకుల్లాగా కనబడటం మొదలైంది. పదాల్ని తేలికగా వదిలెయ్యడం కోసం పంక్చువేషన్‌ను వదిలేశాడు. ద లైస్, ద క్యారియర్స్‌ ఆఫ్‌ లాడర్స్, ద రెయిన్‌ ఇన్‌ ద ట్రీస్, తొంభై ఏళ్ల వయసులో ఈ మార్చి 15న మెర్విన్‌ మరణించాడు.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top