ఇక ఉంటా.. మీ సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ | Sakshi
Sakshi News home page

ఇక ఉంటా.. మీ సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌

Published Mon, Jun 5 2017 10:59 PM

ఇక ఉంటా.. మీ సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం కారణంగా గతి తప్పుతున్న వాతావరణం.. ఫలితంగా ఏర్పడుతున్న దుష్ర్పభావాలు.. రాబోయే విపత్తులను ఎలా ఎదుర్కోవాలి? ఎలా అరికట్టాలన్న పరిష్కార మార్గాల విశేషాలతో కర్ణాటకలోని గుల్బర్గా నుంచి గార్లదిన్నె మండలంలోని కల్లూరు రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు.. మూడు రోజుల పాటు విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచింది. 16 బోగీలు కలిగిన ఈ ఏసీ రైలులో 15 బోగీల్లో విజ్ఞాన సమాచారంతో నింపేశారు. ఈ మూడురోజుల్లో జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన 17,897 మంది విద్యార్థులు ఈ రైలును సందర్శించారు. చివరి రోజు రైల్వే శాఖ అసిస్టెంట్‌ కమర్షియల్‌ మేనేజర్‌ రాజేంద్రప్రసాద్‌ కూడా ఈ రైలును పరిశీలించారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఈ విజ్ఞాన భాండాగారం బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌కు బయలుదేరి వెళ్లిపోయింది.

- గార్లదిన్నె (శింగనమల) 

Advertisement
Advertisement