పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. ఇంటికి వెళ్లేందుకు ప్రయాణికుల ఆటో ఎక్కగా.. ఆటో డ్రైవర్ దారి మరల్చి ఇద్దరు విద్యార్థినులను ఎటో తీసుకెళ్లిపోయాడు.
రాజానగరం (తూర్పుగోదావరి) : పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. ఇంటికి వెళ్లేందుకు ప్రయాణికుల ఆటో ఎక్కగా.. ఆటో డ్రైవర్ దారి మరల్చి ఇద్దరు విద్యార్థినులను ఎటో తీసుకెళ్లిపోయాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో గురువారం చోటుచేసుకుంది.
స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. తూర్పుగానునగూడెం వైపు వెళ్లాల్సిన ఆటో డ్రైవర్ ఇద్దరు బాలికలు ఆటో ఎక్కాక.. పెద్దాపురం వైపు తీసుకెళ్లాడు. ఇది గుర్తించిన తోటి విద్యార్థులు స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.