ఉద్యోగుల సమష్టి కృషితో వర్సిటీ ప్రగతి
ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రగతికి ఉద్యోగుల సమష్టి కృషి ఫలితమేనని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు.
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రగతికి ఉద్యోగుల సమష్టి కృషి ఫలితమేనని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులను వీసీ సత్కరించారు. ఫార్మశీ విభాగం నిర్వహించిన పదవీవిరమణ సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవీ విరమణ అనంతరం ఉద్యోగులు తమ అనుభవాన్ని వర్సిటీ అభివృద్ధి్దకి వినియోగించాలని సూచించారు. దశాబ్ధాలుగా వర్సిటీకి విశిష్ట సేవలు అందించిన ఉద్యోగులను సత్కరించడం మంచి పరిణామమన్నారు. వీరి సేవలను వర్సిటీ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు. వర్సిటీ రెక్టార్ ఆచార్య ఈఏ నారాయణ మాట్లాడుతూ పదవీ విరమణ తరువాత ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ జీవనాన్ని సాగించాలని సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగుల సేవలను వర్సిటీ గుర్తిస్తుందన్నారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, కార్యదర్శి పి.అప్పలరాజు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.