
'బాబుకు దమ్ము, ధైర్యముంటే ప్రధానిని నిలదీయాలి'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాని నరేంద్ర మోదీని నిలదీయాలని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ సవాల్ విసిరారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాని నరేంద్ర మోదీని నిలదీయాలని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ సవాల్ విసిరారు. అనంతపురం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద శైలజానాథ్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెంటనే రాజీనామా చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.