జాతి ప్రయోజనాల కోసమే.. | mudragada about padhayathra | Sakshi
Sakshi News home page

జాతి ప్రయోజనాల కోసమే..

Jul 6 2017 10:44 PM | Updated on Sep 15 2018 8:05 PM

జాతి ప్రయోజనాల కోసమే.. - Sakshi

జాతి ప్రయోజనాల కోసమే..

కిర్లంపూడి(జగ్గంపేట) : ఎన్నికల మేనిఫెస్టోలో, పాదయాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాపుజాతికి ఇచ్చిన హామీల అమలు సాధనకు, జాతి ప్రయోజనాల కోసమే ‘చావోరేవో’ పేరుతో చలో అమరావతి నిరవధిక పాదయాత్రను ఈనెల 26 నుంచి నిర్వహించ తలపెట్టి

- నిరవధిక పాదయాత్ర చేపడుతున్నా
– క్రమ శిక్షణతో పాదయాత్రకు తరలిరావాలి 
– ముద్రగడ పద్మనాభం
కిర్లంపూడి(జగ్గంపేట) : ఎన్నికల మేనిఫెస్టోలో, పాదయాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాపుజాతికి ఇచ్చిన హామీల అమలు సాధనకు, జాతి ప్రయోజనాల కోసమే ‘చావోరేవో’ పేరుతో చలో అమరావతి నిరవధిక పాదయాత్రను ఈనెల 26 నుంచి నిర్వహించ తలపెట్టినట్టు మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం గొల్లప్రోలు, కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం నుంచి మైటారుసైకిళ్లపై ర్యాలీగా తరలివచ్చిన యువత ముద్రగడ చేపట్టనున్న నిరవధిక పాదయాత్రకు తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. పాదయాత్రలో పాల్గొంటామని తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రికి గుర్తు చేయడం కోసం ఈ పాదయాత్ర చేపడుతున్నామని, ఎన్ని అవరోధాలు ఎదురైనా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు సాధించుకుని తీరాలన్నారు. కాపు జాతిని మోసగించేందుకు మరోసారి చంద్రబాబు కుట్రపన్నుతున్నారన్నారు. వాటిని తిప్పి కొట్టేందుకు కాపుజాతి సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో గొల్లప్రోలు నుంచి మొగలి అయ్యారావు, దాసం పూసలు, గొల్లపల్లి గంగ, మొగిలి రాంబాబు, కీర్తి వెంకటరమణ, రామిశెట్టి చిట్టియ్య, మొగిలి వెంకటేశ్వరరావు, కుర్రే శంకర్, జ్యోతుల బాబ్జి, సోమవరం నుంచి అంబటి కొండలరావు, కుర్రా వీరనాగు, పూసంశెట్టి రాజేష్, ఎనుగంటి స్వామి, పెన్నిడ్డి సత్యన్నారాయణ, కమ్మిలి వెంకటరమణ, అడపా సత్తిబాబు భారీ సంఖ్యలో కాపులు తరలివచ్చారు. కార్యక్రమంలో జిల్లా కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు, ఆకుల రామకృష్ణ, బీవీ రమణ, గౌతు స్వామి, గోపు చంటిబాబు, చల్లా సత్యన్నారాయణ, తూము  చినబాబు, ఆడారి బాబ్జి, రాపేటి పెద్ద, కురుమళ్ల చిన్ని తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement