ఓడీ చెరువు మండలం మల్లాపల్లి గ్రామానికి చెందిన రాజప్పకు కుమారుడు వెంకటరమణ(53) గురువారం అనుమానస్పదంగా వతి చెందాడు.
ఓడీ చెరువు : ఓడీ చెరువు మండలం మల్లాపల్లి గ్రామానికి చెందిన రాజప్పకు కుమారుడు వెంకటరమణ(53) గురువారం అనుమానస్పదంగా వతి చెందాడు. వివరాలు.. వతుడు వెంకటరమణ అదే గ్రామానికి చెందిన తిరుపతయ్య పదిరోజుల క్రితం కూలి పనులకు బెంగళూరు వెళ్లారు. మంగళవారం రాత్రి మరో వ్యక్తితో కలసి బెంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చారు. అనంతరం ముగ్గురూ మద్యం సేవించేందుకు బయటకు వెళ్లారు.
అర్థరాత్రి సమయంలో వెంకటరమణ అపస్మారక స్థితిలో పడ్డాడని భార్య మంజుల, కుమారుడు రాజుకు తిరుపతయ్య తెలిపాడు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని కదిరి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వతి చెందినట్లు తెలిపారు. తన తండ్రిని తిరుపతయ్య కొట్టడం వల్లే చనిపోయాడని కుమారుడు రాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడ. ఫిర్యాదు మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.