బాలాజీచెరువు (కాకినాడ) : సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ ( ఎన్‌టీయూ) సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి మంగళవారం జేఎన్‌టీయూకే ఉపకులపతి వీఎస్‌ఎస్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఎన్‌టీయూ అందిస్తున్న కోర్సులు, ఉపకార
జేఎన్‌టీయూకే వీసీతో ఎన్‌టీయూ డైరెక్టర్ భేటీ
Aug 9 2016 11:00 PM | Updated on Sep 4 2017 8:34 AM
బాలాజీచెరువు (కాకినాడ) : సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ ( ఎన్‌టీయూ) సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి మంగళవారం జేఎన్‌టీయూకే ఉపకులపతి వీఎస్‌ఎస్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఎన్‌టీయూ అందిస్తున్న కోర్సులు, ఉపకార వేతనాలు, పరిశోధనలు తదితర అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జేఎన్‌టీయూకేతో కలిసి కొన్ని కోర్సులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. డాక్టరేట్ పొందిన ప్రొఫెసర్లతోనే తమ పాఠ్యప్రణాళిక రూపొందించి తరగతులు నిర్వహిస్తున్నామని వివరించారు. సమావేశంలో రెక్టార్ ప్రభాకరరావు, రిజిస్ట్రార్ సాయిబాబు, ఓఎస్‌డీ ప్రసాద్‌రాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement