బేకరీలో పేలిన సిలిండర్ | Cylinder blast in mayuri bakery in kurnool | Sakshi
Sakshi News home page

బేకరీలో పేలిన సిలిండర్

Sep 30 2015 11:07 AM | Updated on Sep 3 2017 10:15 AM

కర్నూలు నగరంలోని రాజ్విహార్ సెంటర్ మయూరీ బేకరీలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బేకరీలోని సిలిండర్ అకస్మాత్తుగా పేలింది.

కర్నూలు : కర్నూలు నగరంలోని రాజ్విహార్ సెంటర్ మయూరీ బేకరీలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బేకరీలోని సిలిండర్ అకస్మాత్తుగా పేలింది. దాంతో అగ్ని కీలలు భారీగా ఎగసి పడ్డాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నాయి. అగ్నిప్రమాదంలో బేకరీ పూర్తిగా దగ్ధమైంది. అగ్నిప్రమాదం వల్ల రూ. 50 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement