ఆవేదనల నివేదనలు | Sakshi
Sakshi News home page

ఆవేదనల నివేదనలు

Published Tue, Apr 25 2017 5:52 PM

collector take the Applications in the karimnagar district

► ప్రజావాణికి బాధితుల తాకిడి

కరీంనగర్‌సిటీ: కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు. మండే ఎండలను సైతం లెక్కచేయకుండా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. ప్రధా నంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల  కోసం దరఖాస్తులు వచ్చాయి. భూ సంబం «ధిత సమస్యలు, పింఛన్లు, రేషన్‌కార్డులు, ఉద్యోగ ఉపాధి కోసం అర్జీలు సమర్పించారు. కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, జే సీ   శ్రీనివాస్, డీఆర్‌వో  మస్రత్‌ఖాన మ్, ఆర్డీవో రాజా  అర్జీలు స్వీకరించారు  
 

హుజురాబాద్‌ మండలం కందుగులలోని ఎస్సీకాలనీలో పూర్వపు పాఠశాల స్థలం కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉందని, ఆ స్థలాన్ని ప్రభుత్వ భవనం కోసం  కేటాయించాలని తెలంగాణ అం బేద్కర్‌ యువజన సంఘం గ్రామాధ్యక్షుడు రొంటాల సురేష్‌ ఆద్వర్యంలో కలెక్టర్‌కు విన్నవించారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కా లనీకి చెందిన అంగన్‌వాడీ కేంద్ర ం–3లో పదేళ్లుగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న సంబంధిత వ్యక్తులపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
 జమ్మికుంట మండలం నగురం సర్పంచ్‌ ఐదు నెలలుగా గ్రామంలో ఉండకపోవడంతో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని, చర్యలు తీసుకోవాలని  బీజేపీ మండల కార్యదర్శి చెరుకు ఓదెలు కలెక్టర్‌కు విన్నవించారు.

డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు స్పందన

ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని జాయింట్‌ కలెక్టర్‌ బద్రి శ్రీనివాస్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు స్పందన వచ్చింది. జమ్మికుంట నుంచి మాటూరి శ్యాంసుందర్, ఆడెపు రాధ మాట్లాడుతూ ఇందిరమ్మ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనగా.. పదిరోజుల్లోగా ఖాతా లో చేరుతాయని తెలిపారు. శంకరపట్నం మండలం కాచాపూర్‌ నుంచి రాజ మౌళి మాట్లాడుతూ సదరమ్‌ సర్టిఫికెట్‌ పరీక్ష చేయకుండా ఇచ్చారనగా..విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.  కరీంనగర్‌ హౌసింగ్‌బోర్డు ను ంచి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రిపేర్లతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నుంచి మురుగునీ రు వస్తోందనగా తగిన చర్య తీసుకుం టామన్నారు.. డీఆర్‌వో అయేషా మస్రత్‌ఖానమ్, ఆర్డీవో రాజాగౌడ్, జిల్లా అధికారులున్నారు. 

Advertisement
Advertisement