కాన్పూర్‌ ఎన్‌కౌంటర్‌లో కీలక పరిణామం

Vinay Tiwari And Another Policeman Were Arrested In Vikas Dubey Case - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో 8 మంది పోలీసులను హతమార్చిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాన్పూర్‌లోని బిక్రూ గ్రామంలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి సమాచారం లీక్‌ చేసిన ఆరోపణలపై సస్పెండ్‌ అయిన చౌబేపూర్‌ స్టేషన్‌ అధికారి వినయ్‌ తివారీ, బీట్‌ ఇన్‌ చార్జి కేకే శర్మలను బుధవారం రోజున అరెస్ట్‌ చేశారు.

కాగా.. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశం నుంచి పారిపోయి ఇతర పోలీసుల ప్రాణాలను ప్రమాదంలో పడేసిన ఆరోపణలపై వీరిని అరెస్ట్‌ చేసి, చౌబేపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు కాన్పూర్‌ రేంజ్‌ ఐజీ మోహిత్‌ అగర్వాల్‌ తెలిపారు. కాగా.. ఈ ఘటనలో ఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు మరణించారు. ఈ కేసులో ఇప్పటికే దూబే అనుచరుడు దయా శంకర్‌ అగ్నిహోత్రిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చదవండి: వికాస్‌ దూబే సహచరుడు అమర్‌ ఎన్‌కౌంటర్‌!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top