
ప్రతీకాత్మక చిత్రం
పశ్చిమగోదావరి జిల్లా : ఏలూరులో 2012 జరిగిన ఓ హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు విధిస్తూ సోమవారం జిల్లా కోర్టు తీర్పు వెల్లడించింది. ఏలూరుకు చెందిన బొట్ట గంగాధర్‌ని 2012 ఏలూరు నగరం కొత్తపేట చేపలతూము సెంటర్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు నరికి చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టులో కేసు 6 ఏళ్లు నడిచిన తర్వాత తీర్పు వెలువడింది.
నేరం రుజువు కావడంతో కంచి మురళీకృష్ణ అలియాస్ చిన్నికృష్ణ, మీసాల దుర్గారావు, చిట్టి ప్రసాద్, మొహమ్మద్ జానీ బాషా, కత్తెర సతీష్, కేంగం గణేష్, రాంమోహన్ రావు అనే ఏడుగురికి సోమవారం మొదటి అదనపు సెషన్స్ జిల్లా జడ్జి జి. గోపి జీవిత ఖైదు విధించారు. అలాగే రూ.1000 జరిమానా విధించారు. ఆధిపత్య పోరు కారణంగానే ఈ హత్య జరిగింది. మరో వర్గానికి చెందిన 14 మందికి ఇదివరకే జీవితఖైదు విధించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.