కోల్డ్‌ స్టోరేజ్‌ సూపర్‌వైజర్‌ ఆత్మహత్య | Cold Storage Supervisor Commits Suicide In Khammam | Sakshi
Sakshi News home page

కోల్డ్‌ స్టోరేజ్‌ సూపర్‌వైజర్‌ ఆత్మహత్య

May 4 2020 9:03 AM | Updated on May 4 2020 9:13 AM

Cold Storage Supervisor Commits Suicide In Khammam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తల్లాడ(ఖమ్మం) : బావిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక శ్రీకృష్ణ కోల్డ్‌ స్టోరేజ్‌ సూపర్‌వైజర్‌ వేముగంటి శివకుమార్‌(27) ఏప్రిల్‌ 29వ తేదీ నుంచి కనిపించడం లేదు. మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన శివకుమార్‌ సొంత గ్రామానికి వెళ్లాడనే అనుమానంతో ఫోన్‌ చేయగా.. లిఫ్ట్‌ చేయలేదు. అయితే తల్లాడ మండలం తెలగవరం సమీపంలో ఫోన్‌ సిగ్నల్స్‌ వచ్చాయి. దీంతో కోల్డ్‌ స్టోరేజ్‌ మేనేజర్‌ అనిల్‌.. సూపర్‌వైజర్‌ అదృశ్యంపై మూడు రోజుల క్రితం తల్లాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (చావులో ఒక్కటయ్యారు..)

అయితే ఆదివారం తల్లాడ సమీపంలోని డంపింగ్‌ యార్డ్‌కు దగ్గర్లో ఉన్న బావిలో శివకుమార్‌ శవమై తేలుతూ కనిపించాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ బి.తిరుపతిరెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌ రమ్మీలో కొంత నగదును పోగొట్టుకోవడం వల్ల మానసికంగా ఆందోళన చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.  (జీడి తోటకు వెళ్లిన మహిళపై.. )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement