మంచం కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు

Brother Attack Case In  Warangal - Sakshi

కరీమాబాద్‌ (వరంగల్‌): తల్లిదండ్రులకు చెందిన మంచం కోసం అన్నదమ్ములు ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణ కాస్త ఒకరి ప్రాణం తీసింది. అన్నను తమ్ముడు కర్రతో కొట్టి హత్య చేసిన సంఘటన మంగళవారం రాత్రి నగరంలోని లేబర్‌ కాలనీలో చోటు చేసుకుంది. మిల్స్‌కాలనీ సీఐ దయాకర్, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. నగరంలోని లేబర్‌కాలనీకి ఈఎస్‌ఐ ఆస్పత్రి సమీపంలో విద్యుత్‌ లైన్‌మన్‌ ఇమ్మడి భాను ప్రకాష్‌(43) తన అన్నదమ్ములకు తల్లిదండ్రులు ఆస్తులు పంచగా మిగిలిన డెకోలం మంచం తమ్ముడైన ఇమ్మడి రాములు ఇంట్లో ఉంది.

ఆ మంచాన్ని తీసుకెళ్లేందుకు మంగళవారం సాయంత్రం సుమా రు 6.30 గంట ల ప్రాంతంలో అన్న ఇమ్మడి భానుప్రకాష్‌ వస్తాడు. ఈ క్రమంలో తమ్ముడు రాములుకు భానుప్రకాష్‌ కు మధ్య తీవ్రంగా గొడవ జరుగుతుంది. ఆగ్రహం చెందిన రాములు అక్కడే ఉన్న కర్రతో అన్న భానుప్రకాష్‌ తల, కాళ్లమీద కొట్టాడు. దీంతో అపస్మారక స్తితిలోకి వెళ్లిన భానుప్రకాష్‌ను ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృ తిచెందాడు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. రాములు పరారీలో ఉన్నాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top