
సాక్షి, గుంటూరు: జిల్లాలోని దాచేపల్లి మండలం గామలపాడు వద్ద గల ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం దాడి చేశారు. లెక్కల్లో చూపని 72 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ అనిల్‌కుమార్‌తో పాటు మరో నలుగురు రవాణా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.