ఆఫీస్‌పై బాంబు దాడి ; 12 మంది మృతి | 12 Dead And 31 Wounded In Kabul Terror Attack | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆఫీస్‌పై బాంబు దాడి

Jun 11 2018 5:30 PM | Updated on Mar 28 2019 6:10 PM

12 Dead And 31 Wounded In Kabul Terror Attack - Sakshi

కాబుల్‌, అప్ఘనిస్తాన్‌ : మంత్రిత్వ కార్యాలయంపై సోమవారం ఉగ్రదాడి ఘటనలో అప్ఘనిస్తాన్‌లోని కాబుల్‌లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కార్యాలయం బయట భారీ మొత్తంలో పేలుడు సంభవించడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రంజాన్‌ పండుగ సందర్భంగా ఉద్యోగులు ముందుగానే ఇళ్లకు వెళ్తున్న సమయంలో బాంబు పేలింది.

మొత్తం 12 మంది చనిపోగా, 31 మంది తీవ్రగాయాల పాలయ్యారని ఆ దేశ గ్రామీణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. మహిళలు, పిల్లలు, ఉద్యోగులు బాధితుల్లో ఉన్నట్లు తెలిపారు. అయితే, ఉగ్రదాడికి బాధ్యులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement