సీ రామాపురం వద్ద స్వర్ణ జైనమందిరం | swarna jaina mandir constructed in tirupati | Sakshi
Sakshi News home page

సీ రామాపురం వద్ద స్వర్ణ జైనమందిరం

Feb 9 2018 8:49 AM | Updated on Feb 9 2018 8:49 AM

swarna jaina mandir constructed in tirupati - Sakshi

శ్రీబ్రõహ్మేశ్వర్‌ పార్శ్వనాథ స్వర్ణ విగ్రహం, స్వర్ణ జైన మందిరం

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతికి సరిగ్గా పది కిలోమీటర్ల దూ రంలో కోట్ల వ్యయంతో నిర్మించిన స్వర్ణ జైన మందిరం రూపుదిద్దుకొంది. సీ రామాపురంలోని శ్రీబ్రహ్మర్షి సిద్దేశ్వర్‌ గురుదేవ్‌ ఆశ్రమంలో దీన్ని శోభాయమానంగా నిర్మించారు. శ్రీబ్రహ్మేశ్వ ర్‌ పార్శ్యనాథ ఆలయంగా దీనికి నామకరణం చేశారు. దక్షిణ భారత దేశంలో తొలి జైన స్వర్ణ మందిరం ఇదేనని ఆశ్రమ ని ర్వాహకులు చెబుతున్నారు. ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపారి రాజేంద్ర సీ మెహతా దీన్ని నిర్మించారు. రూ.5 కోట్ల అంచనా వ్యయంతో ఆలయాన్ని పాలరాతితో నిర్మించారు. 12,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆలయం ఉంది.

ప్రస్తుతం దేవాలయం లోపల బంగారు తాపడాలను పూర్తి చేశారు. మ రో రెండేళ్లలో ఆలయం మొత్తం బంగారు లేపనంతో మెరిసిపోనుందని నిర్వాహకులు తెలిపారు. జైనులు పవిత్రంగా పూజించే రిషభ దేవుడి నుంచి మహా వీరుని వరకూ 24 జైన తీర్థంకరుల ప్రతిమలను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. జైనుల రెండవ తీర్థంకరుడైన పార్శ్వనాథుని విగ్రహాన్ని ఇక్కడ ప్రముఖంగా ప్రతిష్టించారు. శివుడు, లక్ష్మీనారాయణలను ఒకే చోట పూజించే ఏకైక ఆలయంగా దీన్ని పేర్కొంటున్నారు. రెండు వేల పురాతన చరిత్ర కలిగిన సోంపుర సముదాయానికి చెందిన ఆలయ నిర్మాణ శిల్పుల వంశానికి చెందిన ప్రఖ్యాత శిల్పులు ఆలయ నిర్మాణంలో పాల్గొన్నారు. శని, ఆదివారాల్లో జరిగే ప్రత్యేక ఉత్సవాల్లో ఆలయ మూలమూర్తి ప్రతిష్ఠ జరుగుతుందని ఆశ్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. శ్రీ సిద్దేశ్వర్‌ బ్రహ్మర్షి గురుదేవ్, మారుధర్‌ రత్నశాసన ప్రభావక్‌ ఆచార్య, రత్నాకర్‌ సురేశ్వర్‌జీ ఆలయ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశ్రమ పీఆర్‌ఓ డీవీ హరీశ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement