వొలానోలో లైఫ్‌టైమ్ వెల్‌నెస్ పెట్టుబడులు | Sakshi
Sakshi News home page

వొలానోలో లైఫ్‌టైమ్ వెల్‌నెస్ పెట్టుబడులు

Published Thu, May 14 2015 12:49 AM

వొలానోలో లైఫ్‌టైమ్ వెల్‌నెస్ పెట్టుబడులు - Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అడ్వంచర్ స్పోర్ట్స్ నిర్వహణ సంస్థ వొలానో ఎంటర్‌టైన్‌మెంట్‌లో తాజాగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ అనుబంధ సంస్థ లైఫ్‌టైమ్ వెల్‌నెస్ ఆర్‌ఎక్స్ ఇన్వెస్ట్ చేసింది. అయితే, ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం వెల్లడి కాలేదు. నటుడు రామ్‌చరణ్ తేజ్.. వొలానోకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటిదాకా నాలుగు ఇన్వెస్ట్‌మెంట్ సంస్థల నుంచి 1 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించినట్లు బుధవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ సహ వ్యవస్థాపకుడు అద్నాన్ అదీబ్ తెలిపారు.

మరో 6 నెలల్లో ఇంకో 6 మిలియన్ డాలర్లు సమీకరించనున్నట్లు వివరించారు. మూడేళ్లలో రూ. 100 కోట్ల టర్నోవరు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే 34 అడ్వంచర్ రేస్‌లు నిర్వహించనున్నట్లు అదీబ్ తెలిపారు. ప్రస్తుతం డెవిల్స్ సర్క్యూట్ పేరుతో నిర్వహిస్తున్న రన్నింగ్ సిరీస్‌కు మంచి స్పందన వస్తోందని అదీబ్ పేర్కొన్నారు. టీవీ షో ఆధారిత కార్పొరేట్ అబ్‌స్టకిల్ చాలెంజ్ రూపొందిస్తున్నామని, ఎన్‌డీటీవీలో ఇది ప్రసారమవుతుందన్నారు. స్పోర్ట్స్, ఫిట్‌నెస్‌ని ఇష్టపడే వారికి ఇదొక కొత్త వేదికగా నిలవగలదని ఈ సందర్భంగా రామ్‌చరణ్ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement