 
													
సాక్షి, న్యూఢిల్లీ:అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో దేశీయంగా  కూడా ఇంధన ధరలు దిగి వస్తున్నాయి. వరుసగా 13వ రోజులపాటు తగ్గుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధరలు నిన్న (బుధవారం ,అక్టోబరు 31)  స్వల్పం విరామం  తరువాత  నేడు  గురువారం (నవంబరు 1) వాహనదారులకు  మరోసారి మరింత ఊరట కలిగించాయి.  అయితే పెట్రోలు ధరలను  తగ్గించిన ఆయిల్ కంపెనీలు డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.  ప్రస్తుత తగ్గింపుతో వాణిజ్య రాజధాని ముంబైలో 16 పైసలు తగ్గిన పెట్రోలు లీటరు ధర రూ.84.86గా  ఉండగా,  డీజిల్ ధర రూ.77.32 వద్ద ఉంది. ఢిల్లీలో 16 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.79.39. డీజిల్ ధర రూ.73.78 వద్ద కొనసాగుతోంది. 
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు తగ్గి రూ.84.14 పలుకుతోంది. డీజిల్ ధర రూ.80.25 గా ఉంది.
విజయవాడలో పెట్రోల్ ధర రూ.83.29 , డీజిల్ ధర రూ.78.97 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో పెట్రోలు ధర లీటరుకు  రూ .79.99. డీజిల్ ధర రూ.74.16.
కోల్‌కతాలో లీటరు పెట్రోలు ధర రూ. 81.25.   డీజిల్   ధర రూ. 75.63.
చెన్నైలో పెట్రోలు ధర రూ. 82.65 గాను, డీజిల్ ధర లీటరుకు78 రూపాయలుగాను ఉంది. 
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 75 డాలర్ల దిగువకు పడిపోయింది. క్రూడాయిల్ ధర 74.73 డాలర్లకు చేరింది. అక్టోబరులో బ్యారెల్ ధర 86 డాలర్ల గరిష్టస్థాయిని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
