ఇన్ఫోసిస్‌కు వ్యతిరేకంగా కోర్టుకి..

CAIT threatens to move court against Infosys on GSTN glitches  - Sakshi

జీఎస్టీ చట్టం అమలుకు అవసరమైన సాంకేతిక వనరులను సమకూర్చేందుకు ఏర్పాటుచేసిన జీఎస్టీఎన్‌ నెట్‌వర్క్‌ మొరాయిస్తోంది. వర్తకులకు చుక్కలు చూపిస్తోంది. దీంతో విసుగెత్తి పోయిన ట్రేడర్ల బాడీ సీఏఐటీ, ఇన్ఫోసిస్‌కి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకపోతే, ఇక తమ దగ్గర ఎలాంటి ఆప్షన్‌ ఉండదని, కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందని హెచ్చరించింది. కంపెనీ అందించిన జీఎస్టీ పోర్టల్‌ వర్తకులను బాగా వేధిస్తుందని, ఇది విజయవంతం అవడానికి అవాంతరాలు సృష్టిస్తుందని తెలిపింది. రూ.1400 కోట్లలో కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఇన్ఫోసిస్‌, ఇతర కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలియడం లేదని తెలిపింది. జీఎస్టీఎన్‌ నెట్‌వర్క్‌లో అవాంతరాలు ఎదురవుతున్నాయనే ఆరోపణలను ఇన్ఫోసిస్‌ ఖండిస్తోంది. పూర్తిగా ఇవి అవాస్తమని తెలుపుతోంది. దీనిపై ట్రేడర్ల బాడీ సీబీఐ విచారణకు ఆదేశించింది.

ఇన్ఫోసిస్‌కు వ్యతిరేకంగా వెంటనే చర్యలు తీసుకోకపోతే, తమ దగ్గర ఇక ఎలాంటి ఆప్షన్‌ లేదని, దీనిలో కోర్టులో జోక్యం చేసుకోవాల్సి వస్తుందని పేర్కొంది. ప్రజా సంపదను దుర్వినియోగం చేసే అధికారం ఎవరికీ లేదని తెలిపింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన జీఎస్టీ ప్రాజెక్టులో తాము భాగస్వామ్యం కావడం ఎంతో గర్వకారణమని ఐటీ దిగ్గజం ఈ నెల మొదట్లో ఓ ప్రకటన చేసింది. కానీ ఇటీవల జీఎస్టీఎన్‌ నెట్‌వర్క్‌లో సమస్యలు ఎదురవుతున్నాయని ట్రేడర్లు వాపోతున్నారు. ఈ నెట్‌వర్క్‌ మొరాయిస్తున్నట్టు వారు ఆరోపిస్తున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top