‘తుపాకి రాముడి కోతలు మొదలయ్యాయి’ | Vijayasaireddy fires on Chandrababu over Cyclone Fani | Sakshi
Sakshi News home page

‘తుపాకి రాముడి కోతలు మొదలయ్యాయి’

May 4 2019 7:10 PM | Updated on May 4 2019 7:13 PM

Vijayasaireddy fires on Chandrababu over Cyclone Fani - Sakshi

థాంక్యూ సీఎం అని హోర్డింగులు పెట్టుకోలేక పోయానని చంద్రబాబు బాధ

సాక్షి, హైదరాబాద్‌ : తుపాకి రాముడి కోతలు మొదలయ్యాయని సీఎం చంద్రబాబునాయుడిపై వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం రేయింబవళ్లు తుపానుకు ఎదురొడ్డి ప్రాణనష్టం లేకుండా చూస్తే అభినందించాల్సింది పోయి వాళ్ల క్రెడిట్ కొట్టేస్తున్నాడని మండిపడ్డారు. కలెక్టర్లు, సిబ్బంది స్పందించిన తీరు ప్రశంసనీయని ట్విటర్‌లో పేర్కొన్నారు. థాంక్యూ సీఎం అని హోర్డింగులు పెట్టుకోలేక పోయానని చంద్రబాబు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు.

'ఫొని నష్టంపై కేంద్రానికి అప్పుడే నివేదిక వెళ్లింది. ఇంతకు ముందు లేని నష్టాన్ని కూడా చూపే వారు. 2800 ఎకరాల్లో పంట, 2 వేల స్థంబాలు, 117 సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయని సీఎస్ వాస్తవిక రిపోర్టు పంపారు. చంద్రబాబు డిస్టర్బెన్స్ లేక పోవడంతో యంత్రాంగం స్వేచ్ఛగా, వేగంగా పనిచేసింది. బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిర్యాలు తాటికాయంత అన్నాడట చంద్రబాబు లాంటి వాడు. వీవీప్యాట్లను తన ఒత్తిడి వల్లే ప్రవేశ పెట్టారని కోస్తున్నాడు. 2013లో నాగాలాండ్ నోక్సెన్ అసెంబ్లీ, 2014 లోక్ సభ ఎన్నికల్లో 8 చోట్ల  ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. అప్పుడీయన ఎక్కడున్నాడు.

ఫొని తుఫాను సహాయ చర్యలకు తమ హెల్ప్ కావాలంటే చెప్పాలని ఒరిస్సా సీఎంను చంద్రబాబు అడిగారట. గతంలో తిత్లీ తుఫాను తీరం దాటక ముందే.. థ్యాంక్యూ సీఎం సార్, తుఫాను నుంచి మా ప్రాణాలు రక్షించినందుకు అని సొంతంగా హోర్డింగులు పెట్టించుకున్నట్టే ఉంది ఈ వ్యవహారం కూడా. ఉత్తరాంద్రలో తుఫాను పునరావాస పనులు జరుగుతున్నాయి. మరో పక్క ఎన్నికల కోడ్ అమలులో ఉండగా గ్రూప్-2 పరీక్షలు నిర్వహించడమేమిటి? మరో నెల రోజులు వాయిదా వేయలేరా? ఏపీపీఎస్సీ ఛైర్మన్ దేనికో హడావుడి పడుతున్నట్టు కనిపిస్తోంది. గవర్నర్ జోక్యం చేసుకుని వాయిదా వేయించాలి' అని విజయసాయిరెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement