పరిటాల సునీతకు రెబల్ అభ్యర్థి షాక్ | Rebel Candidate Vepakunta Rajanna shocks Paritala Sunitha | Sakshi
Sakshi News home page

పరిటాల సునీతకు రెబల్ అభ్యర్థి షాక్

Apr 23 2014 4:38 PM | Updated on Aug 14 2018 4:21 PM

పరిటాల సునీతకు రెబల్ అభ్యర్థి షాక్ - Sakshi

పరిటాల సునీతకు రెబల్ అభ్యర్థి షాక్

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీతకు ఎదురుదెబ్బ తగిలింది.

అనంతపురం: పలు జిల్లాల్లో రెబల్స్ బెడద తెలుగుదేశం పార్టీని పట్టి పీడిస్తోంది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీతకు ఎదురుదెబ్బ తగిలింది. పరిటాల ముఖ్య అనుచరుడు వేపకుంట రాజన్న నామినేషన్‌ ఉపసంహరించుకోకపోవడంతో పార్టీకి తీరని నష్టం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
అలాగే  పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి రెబల్స్‌ బెడద ఎక్కువగానే ఉంది. పాలకొల్లు టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా డాక్టర్‌ బాబ్జి, తాడేపల్లిగూడెం టీడీనీ రెబల్‌ అభ్యర్థిగా కొట్టు సత్యనారాయణ, కొవ్వూరు టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా టీవీ రామారావులు బరిలో ఉన్నారు. 
 
విశాఖ జిల్లాలో భీమునిపట్నం నియోజకవర్గంలో టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా అనితా సఖ్రూ పోటిలో నిలిచారు.  గంటా శ్రీనివాసరావు ఓటమే తన లక్ష్యమని అనితా సఖ్రూ అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement