ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో ఒంగోలులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
ఒంగోలు: ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో ఒంగోలులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఇక్కడి చేరుకోనున్న సీఎం చంద్రబాబు.. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
బాబు రాక సందర్భంగా ముందు జాగ్రత్తగా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఆందోళనలు చేయనున్నారనే అనుమానంతో నిరుద్యోగ యువకులతోపాటు, అగ్రిగోల్డ్ బాధితులను అదుపులోకి తీసుకున్నారు. సీఎం రాకపోకలు సాగించే మార్గంలో హోటళ్లు, దుకాణాలను మూసివేయాలని హుకుం జారీ చేశారు. పోలీసుల ఆంక్షలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.