కార్మికుల భద్రత గాలికి..

Nandala Ammonia gas leak Incident; Factory Ownership Negligent - Sakshi

ప్రమాద స్థలంలో కనిపించని ఆక్సిజన్‌ సిలిండర్లు 

అగ్నిమాపక శాఖ అనుమతులూ లేవు 

అధికారులు సకాలంలో స్పందించకపోయి ఉంటే భారీ ప్రాణనష్టం ! 

మేనేజర్‌ శ్రీనివాసరావు కుటుంబాన్ని ఆదుకోవడంలో మీనమేషాలు 

రూ.2 కోట్ల నష్ట పరిహారం ఇవ్వాలని బంధువుల ఆందోళన 

రూ.50 లక్షలతో సరిపెట్టిన యాజమాన్యం

నంద్యాల శివారులోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం నిబంధనలను గాలికి వదిలేసింది. కార్మికుల భద్రతను ఏ మాత్రమూ పట్టించుకోలేదు. ఫ్యాక్టరీలోని చాలా సామగ్రి తుప్పు పట్టి ఉంది. దాన్ని మార్చాలన్న ధ్యాస యాజమాన్యానికి లేకుండా పోయింది. చిన్నచిన్న షాపుల్లోనే ఆక్సిజన్‌ సిలిండర్లు ఏర్పాటు చేస్తుంటారు. అలాంటి ఇంత పెద్ద ఫ్యాక్టరీలో ఆక్సిజన్‌ సిలిండర్లు లేవంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు.  

నంద్యాల: ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ ఫ్యాక్టరీలోని డ్రై ఐస్‌ తయారీ యూనిట్‌లో శనివారం అమ్మోనియా గ్యాస్‌ లీకై మేనేజర్‌ శ్రీనివాసరావు మృతిచెందిన విషయం విదితమే. ఈ ఘటన నేపథ్యంలో ఫ్యాక్టరీలోని లోపాలు బయటకు వస్తున్నాయి. ఇందులో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించామని డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ రామకృష్ణారెడ్డి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు జిల్లా అధికారి గురుప్రసాద్, నంద్యాల అగి్నమాపక అధికారి యోగేశ్వరరెడ్డి తెలిపారు. 

ఫ్యాక్టరీలో పని చేసే ఉద్యోగులు, సిబ్బందికి భద్రత పరికరాలు (గ్లౌజులు, బూట్లు, అద్దాలు, మాసు్కలు) లేవు.  
అమ్మోనియా నిల్వ చేసుకోవాలంటే వైజాగ్‌లోని  పీఈఎస్‌ఓ (పెట్రోలియం ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌) నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎలాంటి అనుమతులూ తీసుకోలేదు.  
అమ్మోనియా ట్యాంకర్‌ను ఫ్యాక్టరీ బయట భాగంలో పెట్టాలి. కానీ ఇక్కడ లోపల ఉంచారు.  
అమ్మోనియా వాడే చోట యంత్రాలు ఎక్కువగా తుప్పుపడతాయి. వీటిని ఐదేళ్లకు ఒక సారి నిపుణులతో పరిశీలింపజేసి.. యంత్రాలు మారుస్తూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలను యాజమాన్యం తీసుకోలేదు.  
అమ్మోనియా గ్యాస్‌ను స్థానికంగా దొరికే సిలిండర్ల రూపంలో తెచ్చుకొని.. ట్యాంకర్‌లో నింపుతున్నారు. ఇలా చేయడం నేరం. ట్యాంకర్‌ వద్ద వాటర్‌ కటన్స్‌ పెట్టాల్సి ఉండగా.. వాటిని ఏర్పాటు చేయలేదు.  
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అందరినీ జాగ్రత్త పరిచేందుకు ఏర్పాటు చేయాల్సిన సైరన్లు సైతం లేవు.  
సెల్ఫ్‌ కంటైన్డ్‌ బ్రీతింగ్‌ ఆపరేటర్లు (స్వీయ శ్వాస ఉపకరణాలు) లేవు. గాలిదిశ చూపే పరికరాలు అమర్చలేదు.  
మేనేజర్‌ శ్రీనివాసరావు అమ్మోనియ గ్యాస్‌ లీక్‌ అవుతుండటంతో ఆపడానికి పోయి అక్కడ అత్యవసర ద్వారం లేకపోవడంతో బయటకు రాలేక మృతి చెందినట్లు తెలుస్తోంది. 
ఫ్యాక్టరీలో అనుభవజ్ఞులైన ఉద్యోగులు కూడా లేరు.  
ఇంత పెద్ద ఫ్యాక్టరీకి అగ్నిమాపక శాఖ నుంచి ఇప్పటికీ ఎన్‌ఓసీ తీసుకోలేదు.  
ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసే ఏర్పాటు లేదు.   
గతంలో అగి్నమాపకశాఖ, ఫ్యాక్టరీస్, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు ఇచ్చిన నోటీసులను సైతం యాజమాన్యం ఖాతరు చేయలేదు. 
 
ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకోవడానికి మీనమేషాలు 
ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతి చెందిన మేనేజర్‌ శ్రీనివాసరావు కుటుంబాన్ని ఆదుకోవడానికి ఫ్యాక్టరీ యాజమాన్యం మీనమేషాలు లెక్కించింది. శ్రీనివాసరావు పోస్టుమార్టం ముగిసిన తర్వాత కూడా ఆర్థిక సహాయం విషయంలో యాజమాన్యం స్పందించకపోవడంతో బాధితులు ఆందోళన చేశారు. రూ.2 కోట్ల నష్టపరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. చివరకు రూ.50 లక్షల పరిహారం అందజేసేందుకు యాజమాన్యం అంగీకరించింది. 

ఫ్యాక్టరీ మూసివేతకు రంగం సిద్ధం 
ఎలాంటి భద్రత ప్రమాణాలు పాటించకుండా, అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్న ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీని మూసివేస్తామని కర్నూలు జిల్లా డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ రామకృష్ణారెడ్డి తెలిపారు. భద్రత ప్రమాణాలు పాటించడమే కాకుండా కారి్మకులకు అన్ని సౌకర్యాలు కలి్పంచి, అన్ని అనుమతులు తీసుకున్నాకే ఫ్యాక్టరీని తెరవడానికి అనుమతి ఇస్తామన్నారు. ఈ మేరకు సోమవారం ఫ్యాక్టరీ యాజమాన్యానికి  ఉత్తర్వులు పంపుతామని తెలిపారు. 

నేడు విచారణ కమిటీ రాక 
ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో జరిగిన గ్యాస్‌ లీకేజీ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌ నియమించిన విచారణ కమిటీ సోమవారం ఫ్యాక్టరీలో విచారణ చేయనున్నట్లు నంద్యాల ఆర్‌డీఓ రామకృష్ణారెడ్డి తెలిపారు.  ప్రస్తుతం ఫ్యాక్టరీలో పనులన్నీ నిలిపి వేశామన్నారు.

 తప్పిన భారీ ప్రమాదం 
ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో అమ్మోనియా వాల్వ్‌ పగిలి గ్యాస్‌ లీకైన ఘటనపై అధికారులు వెంటనే స్పందించడంతో భారీ ప్రమాదం తప్పింది.  వంద కిలోల అమ్మోనియా లీక్‌ అయ్యింది. ఈ సమయంలో ఫ్యాక్టరీలో అనుభవజు్ఞలైన ఉద్యోగులు లేకపోవడంతో అమ్మోనియా సరఫరా అయ్యే పైపుల వాల్వ్‌లు ఎక్కడ ఉన్నాయో తెలియక అగ్నిమాపక సిబ్బంది మొదట ఇబ్బంది పడ్డారు. వెంటనే నంద్యాలకు చెందిన చిత్తూరు జిల్లా డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ శివకుమార్‌రెడ్డి రంగంలోకి దిగి అమ్మోనియా గ్యాస్‌ వాల్వ్‌ను ఆఫ్‌ చేయించారు. ఆయన చొరవతో రెండు గంటల్లోనే లీకేజీని అదుపు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top