'కియా పరిశ్రమ తనదైన ముద్ర చూపిస్తుంది'

KIA Motors Resumes Operations In Its Production - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖ గ్యాస్‌ లీక్‌ ప్రమాద బాధిత కుటుంబాలకు సహాయ సేవలందించేందుకు 200 మందితో ఎల్జీ పాలిమర్స్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'గ్యాస్‌ ప్రమాద బాధితులు గతంలో లాగానే సాధారణ జీవితం గడిపేందుకు అన్ని రకాల సహాయక చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి ఆదేశాలతో విశాఖపట్నం ఎల్జీ పరిశ్రమ నుంచి దక్షిణ కొరియాకు స్టైరైన్‌ తరలింపు ప్రక్రియ ముగిసింది. గ్యాస్‌ లీక్‌ పరిసర ప్రాంతాల్లోని 5 గ్రామాల ప్రజలకు, ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని' మంత్రి పేర్కొన్నారు. చదవండి: గ్రామాల రూపు రేఖలు మార్చబోతున్నాం: సీఎం వైఎస్‌ జగన్

కియా కార్ల పరిశ్రమ పునఃప్రారంభం
అనంతపురం జిల్లాలోని కియా కార్ల తయారీ పరిశ్రమ మంగళవారం నుంచి పునఃప్రారంభమైంది. త్వరలోనే ఉత్పాదక రంగంలో కియాకార్ల పరిశ్రమ తయారీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర చూపిస్తుంది. పరిశ్రమలో విధులు నిర్వర్తించే ఉద్యోగుల రక్షణతో పాటు, పనిచేసే కాలంలో పాటించవలసిన ప్రాధాన్యతలపై ప్రభుత్వం ఇప్పటికే మార్గదర‍్శకాలిచ్చినట్లు మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి వెల్లడించారు. చదవండి: 'ఢిల్లీలో చక్రాలు, బొంగరాలు తిప్పిన రోజులెక్కడ'

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top