కలకలం రేపిన అపరిచితుడు!

Hostel Students Fear Of Unknown Person Attacks Anantapur - Sakshi

అర్ధరాత్రి కేజీబీవీలోకి చొరబాటు?

విద్యార్థిని గొంతు నులిమినట్లు ఆరోపణ

సాక్షి ప్రతినిధి, అనంతపురం, బత్తలపల్లి: అపరిచితుడు కలకలం రేపాడు. సంజీవపురం సమీపంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లోకి ఆదివారం అర్ధరాత్రి అపరిచిత వ్యక్తి చొరబడి ఆరో తరగతి విద్యార్థిని గొంతు పట్టుకుని నులిమాడని, అయితే ఆ విద్యార్థి అరవడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడని తోటి విద్యార్థినులు తెలిపారు. నైట్‌వాచ్‌మన్, టీచర్‌ విద్యార్థినుల వద్దకు వెళ్లి విచారణ చేశారు. సోమవారం ఉదయం స్పెషలాఫీసర్‌ మాధవి సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు.

అందులో ఎక్కడా అపరిచితుడు వచ్చినట్లు ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో వెంటనే ఆమె ధర్మవరం రూరల్‌ సీఐ శివరాముడు, ఎస్‌ఐ హారున్‌బాషాలకు సమాచారమందించారు. అనంతరం బత్తలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. విద్యార్థినులు కలలుకంటూ భయాందోళన చెంది ఉంటారని, అపరిచిత వ్యక్తి సంచరించిన ఆనవాళ్లు పరిసరాల్లో ఎక్కడా లభించలేదని కొట్టిపారేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top