వంశధారకు పోటెత్తిన వరద నీరు | Heavy flood water inflow to Vamsadhara | Sakshi
Sakshi News home page

వంశధారకు పోటెత్తిన వరద నీరు

Oct 14 2013 12:22 PM | Updated on Aug 1 2018 3:59 PM

వంశధారకు వరద నీరు పోటెత్తుతుంది. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసారు.

శ్రీకాకుళం : వంశధారకు వరద నీరు పోటెత్తుతుంది. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. కొత్తూరులో నివగాం, మదనాపురంలోని రహదారిపైకి వరదనీరు చేరింది. ఒడిశాలోని నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురియడంతో శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, బాహుదా, మహేంద్రతనయ నదుల్లో వరదనీరు పోటెత్తుతుంది. వంశధార గొట్టా బ్యారేజీ వద్ద  ప్రస్తుత నీటి ప్రవాహం 53వేల క్యూసెక్కులకు చేరింది. అధికారులు బ్యారేజీ  అన్ని గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడిచి పెట్టారు.

ఇక పై-లీన్ తుపాను బీభత్సానికి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం కకావికలమైంది. శనివారం రాత్రి వీచిన ప్రచండ గాలులకు ఒకరు మృతి చెందారు. సుమారు రూ.1,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఉద్యాన పంటలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. మిగతా పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement