చేనేత కార్మికుడి బలవన్మరణం | Handloom weaver commits suicide | Sakshi
Sakshi News home page

చేనేత కార్మికుడి బలవన్మరణం

Apr 5 2015 11:33 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ధర్మవరం పట్టణంలో ఆదివారం జరిగింది.

అనంతపురం: అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ధర్మవరం పట్టణంలో ఆదివారం జరిగింది. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని నేసేపేటలో పెద్దకోట్ల దామోదర్(52) నివాసం ఉంటున్నాడు. దామోదర్ చేనేత కార్మికుడిగా జరీ వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో కొంతకాలంగా వ్యాపారంలో నష్టాలు రావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.

 

సుమారు రూ.4లక్షల వరకు అప్పులున్నాయి. రుణ దాతల ఒత్తిడితో తీవ్ర మానసిక వేదనకు గురైన దామోదర్ ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. దామోదర్‌కు భార్య శ్రీదేవి.. బీటెక్ చదువుతున్న లక్ష్మి, ఇంటర్ చదువుతున్న సుష్మా, చందన అనే కుమార్తెలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement