
రాజీనామాలు చేయకండి: కిరణ్ కుమార్ రెడ్డి
రాజీనామాలు చేయొద్దని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు.
సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలతో కిరణ్
సాక్షి, హైదరాబాద్: రాజీనామాలు చేయొద్దని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. వారు రాజీనామా చేస్తే ఆ ప్రభావం రాష్ట్ర నేతలపై కూడా పడుతుందని, దానివల్ల కొత్త సమస్యలు తలెత్తుతాయని అన్నట్టు సమాచారం. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు శనివారం ఇక్కడి మంత్రుల క్వార్టర్లలో సమావేశమయ్యారు. అనంతరం కిరణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజీనామాల అంశాన్ని ఎంపీలు ప్రస్తావించగా చేయొద్దని కిరణ్ చెప్పారు. రాజీనామాలపై ఇప్పటికిప్పుడే తాము ముందుకెళ్లడం లేదని, కేంద్రం రూపొందించే నోట్ చూశాక ఆలోచిస్తామని నేతలు చెప్పారు. విభజనతో రాయలసీమ ఎడారిగా మారుతుందని ఒక పక్క భయపడుతుంటే కొత్తగా జూరాల, శ్రీశైలం మధ్య కృష్ణా నదిపై మరో కొత్త ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేశారని వార్తలు వచ్చాయని అనంత అన్నట్టు తెలిసింది.
‘‘ఇది సరైన నిర్ణయం కాదు. 70 టీఎంసీల సామర్థ్యమున్న ఆ ప్రాజెక్టుతో శ్రీశైలానికి నీళ్లు తగ్గిపోతాయి. పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం జలాలపై ఆధారపడి ఉన్న సీమ ఎడారవుతుంది’’ అని కిరణ్‌తో అన్నట్టు సమాచారం.మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏపీ ఎన్జీవోలకు సంఘీభావంగా తమ సంఘాలు కూడా పాల్గొననున్నాయని పరిశ్రమలు, యూనివర్సిటీల సిబ్బంది సంఘం తదితర ఉద్యోగ నేతలు శైలజానాథ్‌కు తెలిపారు.