ఏపీలో 4 జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ రద్దు

Cyclone Fani Heads To AP: Poll Code Lifted In 4 Districts - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సడలించింది. ఫొని తుపాను కారణంగా సహాయక చర్యలు, పునరావాస చర్యల కోసం సీఈసీ శుక్రవారం ఎన్నికల కోడ్‌ ఎత్తివేసింది. తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మినహాయింపు ఇస్తూ ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చింది. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగగా, ఓట్ల లెక్కింపు ఈ నెల 23వ తేదీన జరగనుంది. అప్పటి వరకూ ఉన్న ఎన్నికల కోడ్‌ను ప్రస్తుతం ఫొని తుపాను కారణంగా నాలుగు జిల్లాల్లో రద్దు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top