రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణం సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర సి.పి.ఐ. సహాయ కార్యదర్శి జేవీవీ సత్యనారాయణ అన్నారు.
కరవది(ఒంగోలు రూరల్): రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణం సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర సి.పి.ఐ. సహాయ కార్యదర్శి జేవీవీ సత్యనారాయణ అన్నారు.అఖిలభారత యువజన సమాఖ్య 64వ వార్షికోత్సవం సందర్బంగా ఒంగోలు మండలం కరవదిలో మన్నే వెంకటేశ్వర్లు ఆడిటోరియంలో బుధవారం డి.ముక్కంటియ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రుణ మాఫీలు చేస్తామని రైతులను, డ్వాక్రా మహిళలను దగా చేశారన్నారు. జాబు రాకపోతే రూ. 2000 నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు జాబు రాకపోగా ఉన్నవి పోతున్నాయన్నారు. రాష్ట్రాల్లో బీజేపీని పటిష్టం చేసుకొనేందుకు ఊరూరా నాయకలు తిరుగుతున్నారే తప్ప పేదలు, రైతుల సంక్షేమం పట్టడంలేదన్నారు.ఈ సభలో ఎఐవైఎఫ్ నేతలు అరుణ ,పోలవరపు సీతారామయ్య ,వడ్డే హనుమారెడ్డి , కరవది సుబ్బారావు ,డి.ముక్కంటియ్య,ిసీహెచ్ రామిరెడ్డి ప్రసంగించిన అనంతరం ఆటలపోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ప్రజా కళాకారులచే ఁసర్వాంతర్యామిరూ. నాటికను చిల్లర సుబ్బారావు దర్శకత్వ పర్యవేక్షణలో ప్రదర్శించారు. బోయిడి సుబ్బారావు అతిధులకు స్వాగతం పలికారు.