
శైలజానాథ్
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యారని మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు.
అనంతపురం: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యారని మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కష్టమేనని కేంద్ర మంత్రులు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు.
రాయలసీమకు హక్కుగా రావలసిన రాజధాని విజయవాడకు తీసుకువెళ్లారని మండిపడ్డారు. అనంతపురానికి మంజూరైన ఎయిమ్స్ను మంగళగిరికి తరలించారని అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన భూ సేకరణ చట్టం రైతుల హక్కులను కాలరాస్తుందని శైలజానాథ్ ఆందోళన వ్యక్తం చేశారు.