సింహాద్రి అప్పన్నను దర్శించుకొన్న స్పీకర్‌

Assembly Speaker Tammineni Sitaram Visited  Laxmi Narasimha Swamy Temple In Simhachalam - Sakshi

సాక్షి, విశాఖపట్నం : సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారిని గురువారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సతీసమేతంగా దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన స్పీకర్‌ దంపతులు అనంతరం స్వామివారి నిత్య అన్నదాన పథకం కోసం లక్ష రూపాయలు విరాళంగా అందించారు. తమ్మినేని మాట్లాడుతూ... సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం జగన్‌ నేతృత్వంలో స్పీకర్‌గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు. అన్యాక్రాంతమైన దేవుడు భూములను పరిరక్షిస్తామని స్పీకర్‌ పేర్కొన్నారు. అర్హులైన పేదలందరికీ ఉగాదిలోగా ఇళ్ల స్థలాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర రాజధాని అమరావతి తరలింపుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తమ్మినేని ఆరోపించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top