ఇంట్లో ఉన్న 11 నెలల బాలుడిని ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలంలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో జరిగింది.
రాజనగరం (తూర్పుగోదావరి జిల్లా) : ఇంట్లో ఉన్న 11 నెలల బాలుడిని ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలంలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన నూకరాజు, సువర్ణ దంపతులకు 11 నెలల బాలుడు సంతానం.
అయితే గురువారం బాలుడి తల్లి నీటి కోసం వెళ్లిన సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు బాలుడిని ఎత్తుకెళ్లారు. దీంతో దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా ఏళేశ్వరం నుంచి వలస వచ్చిన నూకరాజు దంపతులు శ్రీరామ్‌నగర్ కాలనీలో నివాసముంటూ కూలీ పనుల చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.