ముగిసిన కర్మయోగి శిక్షణ
తాడేపల్లిగూడెం: భారత ప్రభుత్వ ఆధీనంలోని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో నిట్‌లో గత రెండు రోజులుగా సాగుతున్న రాష్ట్రీయ కర్మయోగి లార్జ్ స్కేల్ జన్ సేవా కార్యక్రమం మంగళవారం ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగులను సృజనాత్మకంగా, వృత్తి నిపుణులుగా, సేవా దృక్పథం కలిగిన వారిగా తీర్చిదిద్దడమే ఈ కర్మయోగి మిషన్ ముఖ్య ఉద్దేశమని వక్తలు పేర్కొన్నారు. కొత్త విషయాలను ఉద్యోగులకు విశదీకరించారు. రెండు రోజుల్లో 122 మంది ఉద్యోగులు హాజరయ్యారు. ముగింపు కార్యక్రమంలో రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి, ఆచార్యులు ఎన్.జయరామ్, ఐఐటీ హైద్రాబాద్ సీనియర్ జాయింట్ రిజిస్ట్రార్ ఎం.బద్రీనాధ్, నిట్ వరంగల్ డిప్యూటీ రిజిస్ట్రార్ మణికాంత్, తిరుపతి ఐఐటీ సీనియర్ అసిస్టెంటు రిజిస్ట్రార్ అరుణ్ కల్యాణ్, విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ ఇంచార్జ్ రిజిస్ట్రార్ శ్యామ్ కుమార్ మాస్టర్ ట్రైనర్లుగా వ్యవహరించారు.


