అండర్‌–12 క్రికెట్‌ జట్టు ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

అండర్‌–12 క్రికెట్‌ జట్టు ఎంపిక పోటీలు

Feb 11 2026 8:55 AM | Updated on Feb 11 2026 8:55 AM

అండర్

అండర్‌–12 క్రికెట్‌ జట్టు ఎంపిక పోటీలు

అండర్‌–12 క్రికెట్‌ జట్టు ఎంపిక పోటీలు గుర్తుతెలియని వృద్ధుడి మృతి ఆలయాల్లో చోరీకి విఫలయత్నం ట్రాక్టర్‌ బోల్తా పడి కూలీ మృతి

ఏలూరు రూరల్‌: ఈ నెల 13, 14 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్‌–12 బాలుర క్రికెట్‌ జట్టు ఎంపిక పోటీలు చేపట్టనున్నామని క్రికెట్‌ అసోసియేషన్‌ త్రిసభ్య కమిటీ సభ్యుడు ఎస్‌కే షాకిర్‌హుస్సేన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూరు సీఆర్‌ఆర్‌ కళాశాల గ్రౌండ్‌లో ఉదయం 8 గంటలకు ఎంపిక పోటీలు ప్రారంభమౌతాయని వివరించారు. ఇందులో పాల్గొనే క్రీడాకారులు 01–09–2013 తర్వాత పుట్టిన వారై ఉండాలన్నారు. ఆసక్తి గలవారు పుట్టినతేదీ ధ్రువీకరణ, ఆధార్‌తో పాటు స్టడీ సర్టిఫికెట్ల ఒరిజినల్స్‌తో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 70136 33143 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

తణుకు అర్బన్‌: తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు తణుకు రూరల్‌ ఇన్‌చార్జి ఎస్‌సై జానా సతీష్‌ తెలిపారు. ఈనెల 9న తణుకు మండలం యర్రాయిచెర్వు గ్రామంలోని వినాయకుడి విగ్రహం వద్ద సుమారు 60 ఏళ్లు వయసు కలిగిన వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయారు. స్థానికులు 108 ద్వారా వృద్ధుడిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 94407 96681, 94411 44789 నంబర్లలో తెలియజేయాలని ఆయన కోరారు.

భీమడోలు: గుండుగొలను గ్రామంలోని మెయిన్‌ రోడ్డులోని వినాయకుని ఆలయం, రామాలయం, గంగానమ్మ ఆలయాల్లో చోరీకి విఫలయత్నం జరిగింది. ఆలయాల్లో హుండీ అపహారణ, వస్తువులను చెల్లాచెదురుగా పడేయడం, తలుపులు పగలగొట్టి ఉండడాన్ని ఆలయ కమిటీ సభ్యులు గుర్తించారు. రామాలయంలోని హుండీని అపహరించి, అందులోని రూ.15 వేలు నగదు చోరీ చేసినట్లు రామాలయం కమిటీ సభ్యుడు వెలివెల సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సీసీ ఫుటేజీ, వేలిముద్రలను సేకరించారు.

జంగారెడ్డిగూడెం: ట్రాక్టర్‌ ట్రక్కు బోల్తా పడి కూలీ మృతిచెందిన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. ఎస్సై ఎన్‌వీ ప్రసాద్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన జాలా ప్రసాద్‌ (49) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 9న ఓ రైతుకు చెందిన పొగాకు తోటలో పనికి వెళ్లిన ప్రసాద్‌, అక్కడ నుంచి ట్రాక్టర్‌లో పొగాకు లోడు వేసుకుని వస్తున్నాడు. పట్టణంలోని బుట్టాయగూడెం రోడ్డులో ఉన్న రాజారాణి కళ్యాణ మండపం వద్దకు వచ్చేసరికి ట్రాక్టర్‌, ట్రక్కు తిరగబడటంతో ప్రసాద్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై మృతుని భార్య రత్నకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

అండర్‌–12 క్రికెట్‌ జట్టు ఎంపిక పోటీలు 
1
1/1

అండర్‌–12 క్రికెట్‌ జట్టు ఎంపిక పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement