తపాలా సేవల్లో సాంకేతిక పరిజ్ఞానం జోడించండి | - | Sakshi
Sakshi News home page

తపాలా సేవల్లో సాంకేతిక పరిజ్ఞానం జోడించండి

Feb 11 2026 8:55 AM | Updated on Feb 11 2026 8:55 AM

తపాలా సేవల్లో సాంకేతిక పరిజ్ఞానం జోడించండి

తపాలా సేవల్లో సాంకేతిక పరిజ్ఞానం జోడించండి

కై కలూరు: తపాలా సేవల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ బీపీ.శ్రీదేవి సూచించారు. ఆటపాక బ్రాంచి పోస్టాఫీస్‌ను మంగళవారం ఆమె సందర్శించారు. అనంతరం కై కలూరు, పల్లెవాడ పోస్టాఫీసుల పరిధిలోని 20 బ్రాంచి పోస్టాపీసుల గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌(జీడీఎస్‌) సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తపాలశాఖ ఐవీ 2.0 అనే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందిస్తోందన్నారు. సిబ్బంది పోస్టల్‌ పథకాలకు అత్యధిక ప్రచారం కల్పించాలన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన పథకాలు తపాలశాఖ అందిస్తోందని తెలిపారు. అనంతరం ఆటపాక పక్షుల విహార కేంద్రంలో బోటు షికారులో పక్షుల కేరింతలను ఆశ్వాదించారు. కార్యక్రమంలో గుడివాడ డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.కృష్ణమూర్తి, ఏఎస్‌పీ సీహెచ్‌.శ్రీనివాసరావు, కై కలూరు సబ్‌ డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ కందగిరి సురేష్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ బి.విజయ్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఏపీ చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ శ్రీదేవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement