అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు
కొల్లేరులో కనువిందు
కొల్లేరు అభయారణ్యంలో పక్షుల గణన పూర్తయ్యింది. శీతాకాలంలో సుమారు 40 వేల నుంచి 50 వేల పక్షులు సంచరించినట్టు సమాచారం. 8లో u
పెనుగొండ: ఆచంట మండలం పెదమల్లం పరిధిలోని అనగారలంకలో ఇసుక అక్రమ త వ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద మల్లం గ్రామస్తులు డిమాండ్ చేశారు. శనివా రం ఆచంట తహసీల్దార్ కార్యాలయంలో, ఆచంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఆర్‌జెడ్ పరిధిలో ఉన్నా అక్రమ తవ్వకాలు చేస్తున్నారని, నాలుగు రోజులుగా ర్యాంపు పనులు చేస్తూ, తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణం తనిఖీలు నిర్వహించి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని కోరారు. అలాగే అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంతో పాటు లారీలు, ట్రాక్టర్లు, ఇతర యంత్రాలను సీజ్ చేయాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు జరగకుండా కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని కోరారు. నదీ పరీవాహక ప్రా ంతాన్ని, పర్యావరణాన్ని, ప్రజల జీవనాధా రాన్ని కాపాడటంలో రెవెన్యూ అధికారులు బా ధ్యత వహించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామస్తులు బోడపాటి సూరిబాబు, రాజమహేంద్రవరపు శివ, కొండేటి భవానీప్రసాద్, మాతా వినయ్, మాతా గణేష్, నక్కా శ్రీను, బల్ల రాంబాబు, మట్టా సన్నీ, మట్టాధనుష్ వినతిపత్రం అందించగా కొడమంచిలి సర్పంచ్ సుంకర సీతారామ్, కోట వెంకటేశ్వరరావు, పెచ్చెట్టి సత్యనారాయణ, కొంబోత్తుల దుర్గాప్రసాద్ తదితరులు మద్దతు తెలిపారు.


