సుజుకీ ఈ–ఆక్సిస్ స్కూటర్ విడుదల
భీమవరం: భీమవరంలోని శ్రీకృష్ణ సుజుకీ షోరూంలో బ్యాటరీ వెహికల్ ఈ–ఆక్సిస్ టూవీలర్ విడుదల కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా రవాణాశాఖాధికారి కెఎస్‌ఎంవీ కృష్ణారావు, వెహికల్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ వెహికల్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ సుజుకి షోరూం సిబ్బంది పాల్గొన్నారు.
ఆకివీడు: హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంపై కలెక్టర్ సీహెచ్.నాగరాణి ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక బీసీ హాస్టల్‌ను గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంపై అసంతృప్తి తెలిపారు. బాత్‌రూమ్ తలుపులు విరిగిపోవడం పరిశీలించి ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అరుణ తదితరులు పాల్గొన్నారు. తొలుత స్థానిక గాలిబ్ చెరువు ప్రాంతంలో వరి సాగును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా రైతు గంధం మధు కలెక్టర్‌కు యూరియాతో పాటు ఇతర ఎరువులు ఇవ్వడంలేదని ఫిర్యాదు చేశారు. జింక్ లోపం అధికంగా ఉందని జింక్ మందులు సబ్సిడీపై అందజేయాలని విజ్ఞప్తి చేశారు.
కొయ్యలగూడెం: చింతలపూడి ఎత్తిపోతల కాలువ గట్టు నుంచి అక్రమార్కులు మట్టిని యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. వారం రోజులుగా కన్నాపురం పులిరామన్నగూడెం గ్రామాల మధ్య ఉన్న ఎత్తిపోతల కాలువ గట్టు నుంచి మట్టి రవాణా చేస్తున్నప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రేయింబవళ్లు మట్టి తోలకాలు సాగుతున్నా చర్యలు తీసుకోకపోవడంతో భవిష్యత్తులో కాలువకు గండ్లు పడే ప్రమాదం ఉందని రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం మండలాలలోని పరిసర గ్రామాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల నిమిత్తం నిబంధనలకు విరుద్ధంగా కాలువ గట్టు ఎత్తిపోతల మట్టిని వినియోగిస్తున్నట్లు తెలిసింది. అభివృద్ధి పనులకు వినియోగించాల్సిన గ్రావెల్ మట్టికి బదులు నాణ్యతలేని మట్టిని వినియోగించడం వలన భవిష్యత్తులో నిర్మాణాలు సుదీర్ఘ కాలం ఉండవని ప్రజలు పేర్కొంటున్నారు.
సుజుకీ ఈ–ఆక్సిస్ స్కూటర్ విడుదల


