ఆ స్ఫూర్తిని పంచడమే అసలైన నివాళి

Vice President Venkaiah Naidu Calls For Imbibing Acharya Ramanujas Teachings For New India - Sakshi

ప్రాణికోటి సమానత్వమే రామానుజాచార్యుల సందేశం: వెంకయ్యనాయుడు

సాక్షి, హైదరాబాద్‌/రంగారెడ్డి జిల్లా/శంషాబాద్‌: ‘‘సమాజంలో నెలకొన్న వివక్ష, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా వెయ్యేళ్ల క్రితమే విప్లవానికి నాంది పలి కిన గొప్ప గురువు రామానుజాచార్యులు. ఆయన స్ఫూర్తిని చాటేందుకు సమతామూర్తి కేంద్రం దోహ దం చేస్తుంది. పెద్ద పెద్ద వాళ్లందరూ ఇక్కడికి రావ డంలో ముఖ్యోద్దే్దశం రామానుజుల స్ఫూర్తిని పొంద డం, పంచడం కోసమే. ఈ స్ఫూర్తిని సమాజానికి చేరువ చేయడమే రామానుజులకు అందించే నిజ మైన నివాళి’’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

సందర్శకులను మంత్రముగ్ధుల ను చేస్తూ, స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న సమతా మూర్తి ప్రపంచపు 8వ వింత అని కొనియాడారు. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో జరుగుతున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్స వాల్లో ఆయన శనివారం పాల్గొన్నారు. సేవ చేయ డమే అత్యున్నత ఆధ్యాత్మిక కార్యక్రమమని, కుల మతాలకు అతీతంగా మానవత్వమే ప్రధానంగా సేవ చేయాలని వెంకయ్యనాయుడు సూచించారు.

ప్రస్తుతం కొన్నివర్గాలు రాజకీయ, వ్యక్తిగత ప్రయో జనాల కోసం కుల, వర్గ వైషమ్యాలను ప్రోత్సహి స్తున్న తరుణంలో రామానుజుల బోధనలు మనకు ప్రేరణ కలిగించాల్సి ఉందని.. అందుకు సమతా మూర్తి కేంద్రం దోహదం చేస్తుందని చెప్పారు.  తెలుగువారి గొప్పదనాన్ని, తెలుగు భాషా సంస్కృ తులను ముందు తరాలకు తెలియజేసేలా ఏదైనా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా చినజీయర్‌ స్వామిని కోరారు. కాగా.. రామానుజు లు ఏది బోధించారో, దాన్ని ఆచరించారని అందుకే గొప్ప గురువు అయ్యారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. శ్రీరామనగరం ఆధ్యాత్మిక కేంద్రం గా, ఒక స్ఫూర్తి కేంద్రంగా, తెలంగాణకు శోభాయ మానంగా నిలబడుతుందని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు.

పరమేష్టి, వైభవేష్టి హోమాలు..
శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహం 11వ రోజైన శనివారం ఉదయం అష్టాక్షరి మహామంత్ర జపంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తర్వాత ఇష్టిశాలలో పరమేష్టి, వైభవేష్టి హోమాలు నిర్వహించారు. మధ్యాహ్నం ప్రవచన మండపంలో గోపాలోపాయనం కార్యక్రమాన్ని నిర్వహించారు. జీయర్‌స్వామి గురువైన గోపాలాచార్యుల పేరిట ఇచ్చే గోపాలోపాయన పురస్కరాన్ని తమిళనాడుకు చెందిన మాడభూషి వరదరాజన్‌కు అందజేశారు.  

సమతామూర్తిని దర్శించుకున్న ప్రముఖులు
శనివారం ఉదయం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు, శాంతా బయోటెక్‌ ఎండీ వరప్రసాదరెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శివశంకర్‌ పాల్గొన్నారు. సినీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ తల్లి శాలిని, భార్య లక్ష్మీప్రణతి కూడా సమతామూర్తి, దివ్యదేశాలను సందర్శించారు. 

రేపటి నుంచి సువర్ణమూర్తి దర్శనం
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం సాయంత్రం శ్రీరామానుజాచార్యుల సువర్ణ మూర్తిని లోకార్పణ చేయనుండటంతో.. సోమవారం నుంచి భక్తులందరినీ దర్శనానికి అనుమతించనున్నారు.

జనసంద్రంగా శ్రీరామనగరం
రెండో శనివారం సెలవుదినం, దానికి భీష్మ ఏకాదశి తోడు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీరామనగరానికి పోటెత్తారు. దీనితో ప్రధాన విగ్రహం సహా యాగశాలకు వెళ్లే మార్గాలు కిక్కిరిసి పోయాయి. రాత్రి వరకు కూడా భక్తుల రాక కొనసాగింది. ఒక్కరోజే రెండు లక్షల మంది వరకు వచ్చినట్టు అంచనా వేశారు.

ఈ ప్రాంతం పునీతం: చిరంజీవి
భీష్మ ఏకాదశి రోజున సమతామూర్తిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని సినీ నటుడు చిరంజీవి అన్నారు. శ్రీరామనగరాన్ని వీక్షించాక ఇది ఎంత అద్భుతమో తెలిసిందని, కేవలం ఆరేళ్లలో ఈ దివ్య సంకేతాన్ని నిర్మించడం అమోఘమని కొనియాడారు. చినజీయర్‌ స్వామి సారథ్యంలో జూపల్లి రామేశ్వరరావు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని చెప్పారు.

వెయ్యేళ్ల క్రితం రామానుజులు సర్వమానవ సమానత్వం గురించి ప్రపంచానికి బోధించారని తెలిపారు. సమతామూర్తి దివ్యక్షేత్రం కొన్ని వేల ఏళ్లపాటు వర్ధిల్లుతుందన్నారు. మహారాజులు, చక్రవర్తులే ఇంత పెద్ద ఆలయాలు, విగ్రహాలు నిర్మించగలరని అనుకున్నామని.. సంకల్పం ఉంటే మనమూ సాధ్యం చేయగలమని ఇది నిరూపించిందని చిరంజీవి పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top