పరీక్షలు రాయకుండా పాస్‌ చేయలేం: ఇంటర్‌ బోర్డు 

Telangana Intermediate Board Says Annual Exams Definitely Conduct - Sakshi

ఒకట్రెండు రోజుల్లో హాల్‌టికెట్లు జారీ

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఇంటర్‌ విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. పరీక్షలు లేకుండా విద్యార్థులను పాస్‌ చేసే ఆలోచన బోర్డుకు లేదని అధికారులు చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో హాల్‌టికెట్లు జారీ చేయనున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయం వెల్లడించింది. మొదటి సంవత్సరం విద్యార్థులకు పర్యావరణం, నైతిక విలువల పరీక్షలను అసైన్‌మెంట్‌ రూపంలో నిర్వహించాలని భావిస్తోంది. ఏప్రిల్‌ 1, 3 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనుంది. ఏప్రిల్‌ 7 నుంచి జరిగే ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. 

చదవండి: ఇంటర్‌లో 30% సిలబస్‌ కోత

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top