‘అత్తమామలు ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. భర్తతో మాట్లాడనీయడం లేదు’

Hyderabad Women Protest In Front Of In laws House Over Harassment - Sakshi

సాక్షి, చిక్కడపల్లి: అత్తమామలు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని, భర్తను తనతో మాట్లాడనీయడం లేదంటూ ఓ వివాహిత గురువారం అశోక్‌నగర్‌లోని వారి ఇంటి ముందు నిరసన చేపట్టింది. ఏలూరుకు చెందిన గౌరి, అశోక్‌నగర్‌కు చెందిన శ్రీకృష్ణకు 2019లో వివాహం జరిగింది. గత నాలుగు నెలలుగా భర్తను తనతో మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని, అత్తమామలు తన సామాన్లు బయటపడేసి వెళ్లగొట్టారని ఆరోపిస్తూ ఇంటి ముందు నిరసనకు దిగింది.

తన భర్తను గచ్చిబౌలిలోని వేరే ఇంటికి పంపించి అత్తమామలు వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలంటూ గౌరి చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించింది. సీఐ సంజయ్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఐ అశోక్‌నగర్‌కు వచ్చి ఆమెను తిరిగి ఇంట్లోకి పంపించారు. అయితే గౌరి కేసు పెట్టడానికి అంగీకరించలేదని లీగల్‌గా ప్రొసీడ్‌ అవుతానని చెప్పిందని సీఐ తెలిపారు.  


చదవండి: కలహాలతో పిల్లలు బలి.. కన్న పేగుతో కాటికి.. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top