హైదరాబాద్‌ యువకుల అనైతిక సంబంధం.. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే..!

Hyderabad: Illicit Relationship Same Gender Marriage At Old City Shalibanda - Sakshi

సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో కొత్త కల్చర్‌ వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకుల మధ్య అనైతిక సంబంధం స్వలింగ సంపర్కానికి దారితీసింది. అయితే వీరిద్దరిలో ఒకరు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తనతో నగ్నంగా ఉన్న వీడియోలను సోషల్​ మీడియాలో వైరల్​ చేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు. దీంతో బాధిత యువకుడు ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శాలిబండ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాలు.. శాలిబండకు చెందిన ఓ యువకుని ​ భార్య 2017లో మృతిచెందింది. దీంతో అప్పటి నుంచి ఆ యువకుడు ఆన్​లైన్​లో ​ ట్యూషన్​లు చెప్పేవాడు. 2018లో అతనికి మొఘల్​పురాకు చెందిన మరో యువకుడు​ పరిచయమయ్యాడు. శాలిబండ యువకుడు ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో మహిళల వస్త్రాలు ధరించేవాడు. దీంతో యువకులు మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఇద్దరు స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డారు. 

10 లక్షల ఆర్థిక సాయం
అనంతరం శాలింబండ యువకునికి మరో యువతితో రెండో పెళ్లి జరిగింది. అయితే విషయాన్ని పసిగట్టిన రెండవ భార్య కొన్నాళ్ళకే అతన్ని వదిలి వెళ్ళిపోయింది. దీంతో మళ్ళీ వీరిద్దరు  పీకల్లోడుతు ప్రేమలో మునిగిపోయి సహజీవనం సాగిస్తున్నారు. గత ఫిబ్రవరి నెలలో మొఘల్​పురాకు చెందిన యువకుడికి ఓ యువతితో వివాహం జరిగే సమయంలో శాలిబండకు చెందిన యువకుడు ​10 లక్షల ఆర్థిక సహాయం కూడా  చేశాడు. ఇదే అదనుగా భావించిన మొఘల్​పురా వాసి అడిగినంత డబ్బు ఇవ్వకుంటే తనతో కలిసి ఉన్న సమయంలో సీక్రెట్​గా తీసిన వీడియోలను సోషల్​ మీడియాలో వైరల్​ చేస్తానని బెదిరిపులకు గురిచేశాడు. 
చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. 17 బాలికపై ఇద్దరు యువకుల అఘాయిత్యం

అప్పట్లో మొఘల్​పురా పోలీస్​స్టేషన్​లో కేసు కూడా నమోదయ్యింది. ఆ తర్వాత కూడా తనను దగ్గరికి రానివ్వకపోవడంతో మొఘల్​పురా వ్యక్తి నుంచి ​ రోజు రోజుకు బెదిరింపులు అధికమయ్యాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శాలింబండ యువకుడు మంగళవారం అర్థరాత్రి 40 గుర్తు తెలియని మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతేగాక అతనే 100 కంట్రోల్​ రూమ్​, 108 ఆంబులెన్స్​కు సమాచారం అందించాడు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితికి చేరుకున్న యువకున్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శాలిబండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top