Viral Video: రాంగ్ రూట్‌లో వెళ్తున్నారా.. ఎంత ప్రమాదమో చూడండి

Cyberabad Traffic Police Shares Road Accident Due To Wrong Route - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ పేరు తలుచుకుంటేనే గుర్తుకొచ్చేది ఒకటి బిర్యాని అయితే రెండు ట్రాఫిక్‌.. పని మీద బయటకొచ్చి  రోడ్లపైకి వస్తే ఎన్ని గంటలకు గమ్య స్థానానికి చేరుతారో ఎవరూ ఊహించలేరు. ఆఫీస్​కు లేట్​ అయితే బాస్​ తిడతారనే భయంతో అతివేగంతో రోడ్డు మీద ప్రయాణిస్తుంటారు. మార్గ మధ్యలో రోడ్డు దాటాల్సి వస్తే.. యూ టర్న్​ వరకూ వెళ్లాలి. అలా వెళ్తే కొంత సమయం వృథా అవుతుందనే తొందరలో చాలా మంది తప్పని తెలిసినా రాంగ్​ రూట్​లో ప్రయాణం చేస్తుంటారు. 

ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా, ప్రకటనలు ఇచ్చినా కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఒకరి నిర్లక్ష్యం కారణంగా ఇతరుల ప్రాణాలకూ ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుందని చెప్పేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్‌లో ఓ వీడియో షేర్ చేశారు. ఈ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన వీడియో చూస్తే విషయం అర్థమవుతుంది.
చదవండి: రాజేంద్రనగర్‌లో దారుణం.. యువతిని కారుతో ఢీకొట్టి..

వీడియోలో.. రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ వ్యక్తి బైక్‌పై రాంగ్‌ రూట్‌లో వస్తున్నాడు. హెల్మెట్‌ కూడా ధరించలేదు. అంతేగాక తప్పుడు మార్గంలో వస్తున్నాననే భయం లేకుండా బైక్‌ నడుపుతూ వాహనదారులకు ఎదురెళ్లాడు. ఇంతలో మలుపు నుంచి వస్తున్న కారు అతన్ని బలంగా డీకొట్టింది. దీంతో బైక్‌ మీద ఉన్న వ్యక్తి ఒక్కసారిగా పిట్టలాగ గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయాడు.  ట్రాఫిక్ రూల్ పాటించకపోవడంతో ఎంత పని జరుగుతుందో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు షేర్‌ చేసిన వీడియో చూస్తే అర్థం అవుతుంది. సెంటిమీటర్‌ ప్రయాణం అయినా రాంగ్‌ రూట్‌లో నడపవద్దని పోలీసులు సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top