ఏసీబీ డీజీగా బాధ్యతలు చేపట్టిన అంజనీ కుమార్…

Anjani Kumar Takes charge As A DG Of Anti Corruption Bureau - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డీజీగా అంజనీ కుమార్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అంజనీ కుమార్‌కు ప్రస్తుత డీజీ గోవింగ్‌ సింగ్‌ బాధ్యతలు అప్పజెప్పి కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్‌ మాట్లాడుతూ.. ఏసీబీ డీజీగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏసీబీలో పని చేసే ప్రతి ఒక్క అధికారి నిబద్ధతతో పని చేయాలని సూచించారు. అవినీతి నిర్మూలనకు కృషిచేస్తానని పేర్కొన్నారు. తనను ఏసీబీ డీజీగా నియమించేందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ కమిషనర్‌గా మూడేళ్లు పనిచేయడం సంతృప్తినిచ్చిందని తెలిపారు.

కరోనా మహమ్మారి సమయంలో హైదరాబాద్‌ సీపీగా విధులు నిర్వహించాను.  అన్ని వర్గాల నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంది. నాతో పాటు కలిసి మూడు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు పనిచేసిన అధికారులకు, ప్రజలకు ధన్యవాదాలు. నేను సీపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రి యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకెళ్లాం. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు మా డిపార్ట్మెంట్ ఎంతో సహాయ సహకారాలతో ముందుకెళ్లింది. హైదరాబాదులో ఒక మంచి సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని ఇన్నాళ్ల పాటు కంటిన్యూ చేశాను. ఏసీబీ డీజీగా నియమించి నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. శాఖాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం* అని అంజనీ కుమార్ ప్రకటించారు.
చదవండి: తీన్మార్‌ మల్లన్నపై బీజేపీ అధిష్టానం సీరియస్‌!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top