హరీశ్‌రావు బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారు | Addanki Dayakar and Bathula Laxma Reddy Comments on Harish Rao | Sakshi
Sakshi News home page

హరీశ్‌రావు బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారు

Apr 10 2026 5:35 AM | Updated on Apr 10 2026 10:43 AM

Addanki Dayakar and Bathula Laxma Reddy Comments on Harish Rao

పొంగులేటిపై నిరాధార ఆరోపణలు: అద్దంకి దయాకర్, బత్తుల లక్ష్మారెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతున్నా రని ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్, మిర్యాల గూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆరోపించారు. గురువారం సీఎల్పీ మీడియా సెంటర్‌లో వీరు మీడియాతో మాట్లాడుతూ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై హరీశ్‌రావు నిరాధార ఆరోప ణలు చేస్తున్నారని విమర్శించారు. పొంగులేటి లేదా ఆయన కుటుంబానికి సంబంధం లేని కంపెనీలను ఆయనకు అంటగడుతున్నారని తెలి పారు. శిల్పా ఇన్ఫోటెక్, ఏక్యూ అండ్‌ ఏఎం బిల్డర్స్, క్రిస్టల్‌ మాన్షన్‌ వంటి సంస్థలతో ఆయ నకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

దీనికి సంబంధించిన పత్రాలను మీడియా ముందు ఉంచుతున్నా మని చెప్పారు. నాదర్‌గుల్‌ భూముల వ్యవహా రం బీఆర్‌ఎస్‌ హయాంలోనే జరిగిందని, 2021లో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్‌ జరిగిందని పేర్కొన్నారు. భూముల కేటాయింపులు, బది లీలపై విచార ణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హరీశ్‌ రావుకు గతంలో పారిశ్రామిక వేత్తలను బ్లాక్‌ మెయిల్‌ చేసిన చరిత్ర ఉందని, తన రాజకీయ అస్తిత్వం కోసం ఇప్పుడు ప్రభుత్వంపై విమ ర్శలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజా సమస్య లను పక్కనపెట్టి భూముల చుట్టూ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement