T20 WC 2022: ముగిసిన ప్రపంచకప్.. కోహ్లి సరికొత్త రికార్డు; తొలి బ్యాటర్‌గా

టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా కోహ్లి మరో రికార్డు బద్దలు కొట్టాడు. టి20 ప్రపంచకప్‌లలో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలవడం కోహ్లికి ఇది రెండోసారి. ఈ ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌లు కలిపి 98.66 సగటుతో 296 పరుగులు చేశాడు. కోహ్లి ఖాతాలో నాలుగు అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక మెల్‌బోర్న్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై కోహ్లి (53 బంతుల్లో 82 పరుగులు నాటౌట్) ఇన్నింగ్స్ ఈ ప్రపంచకప్‌కే హైలైట్‌గా నిలిచింది.
ఇక ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల జాబితా చూస్తే.. కోహ్లి తర్వాత నెదర్లాండ్స్‌కు చెందిన మాక్స్ ఓడౌడ్ 8 మ్యాచ్‌ల్లో 242 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో మరో టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్(ఆరు మ్యాచ్‌లు కలిపి 239 పరుగులు) ఉన్నాడు. జాస్ బట్లర్ 225 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా.. లంకకు చెందిన కుషాల్ మెండిస్ 223 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.
అంతకముందు 2014 టి20 ప్రపంచకప్‌లోనూ కోహ్లినే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అప్పుడు ఆరు మ్యాచ్‌లు కలిపి కోహ్లి 106.33 సగటుతో 319 పరుగులు సాధించాడు. అప్పుడు కూడా నాలుగు అర్థసెంచరీలు సాధించిన కోహ్లి అత్యధిక స్కోరు 77గా ఉంది. ఇలా రెండు ప్రపంచకప్‌లలో లీడింగ్ స్కోరర్‌గా నిలవడం కోహ్లికి మాత్రమే సాధ్యమైంది.
ఇక ఓవరాల్‌గా అన్ని ప్రపంచకప్‌లు కలిపి అత్యధిక పరుగులు చేసిన జాబితాలోనూ కోహ్లినే అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు కోహ్లి టి20 ప్రపంచకప్‌లలో 27 మ్యాచ్‌లాడి 81.5 సగటుతో 1141 పరుగులు సాధించాడు. ఇందులో 14 హాఫ్ సెంచరీలు ఉండగా.. 89 పరుగులు నాటౌట్ అత్యధిక స్కోరుగా ఉంది. ఇక టీమిండియా 2007లో జరిగిన తొలి టి20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2014లో ఫైనల్ చేరినప్పటికి కప్ అందుకోవడంలో విఫలమైంది. తాజాగా 2022లో సెమీఫైనల్ చేరినప్పటికి ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకొని ఇంటిబాట పట్టింది.
He's a 1⃣0⃣ but he sets unrealistic standards. 🤷♂️
Now the only player to top the run-scoring charts in✌️T20 World Cups. 🙇♂️#PlayBold #TeamIndia #T20WorldCup @imVkohli pic.twitter.com/CiuOD7IS6U
— Royal Challengers Bangalore (@RCBTweets) November 13, 2022
మరిన్ని వార్తలు