బౌలర్లు చెలరేగితే అట్లనే ఉంటది.. ఒకే రోజు 21 వికెట్లు!

Ranji Trophy Quarter Final: 21 Wickets Fall On Second Off Karnataka Up Match - Sakshi

కర్ణాటక, యూపీ రంజీ క్వార్టర్‌ ఫైనల్‌ 

బెంగళూరు: కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో బౌలర్లు చెలరేగారు. ఫలితంగా మ్యాచ్‌ రెండో రోజు మంగళవారం మొత్తం 21 వికెట్లు కుప్పకూలాయి. ఓవర్‌నైట్‌ స్కోరు 213/7తో ఆట కొనసాగించిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్‌ గోపాల్‌ (56 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకోగా... లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ సౌరభ్‌ 4 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం యూపీ తమ తొలి ఇన్నింగ్స్‌లో 155 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కూడా కర్ణాటక తడబడింది. ఆట ముగిసేసరికి ఆ జట్టు 100 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. సౌరభ్‌ కుమార్‌ 3 వికెట్లు పడగొట్టాడు. ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 647 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. జార్ఖండ్‌తో మ్యాచ్‌లో బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 577 పరుగులు సాధించింది.

చదవండి: Sunil Gavaskar 174-ball 36 Runs: జిడ్డు ఇన్నింగ్స్‌కు 47 ఏళ్లు.. కోపంతో లంచ్‌ బాక్స్‌ విసిరేసిన క్రికెట్‌ అభిమాని

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top